కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. సర్వం బంద్ కావడంతో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. భారత్ లోనూ కోట్ల మంది ఉద్యోగ, ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. అన్ని సంస్థలు నష్టాల బాట పట్టాయి.
ఇక ఇన్నాళ్లు భవిష్యత్ పై బోలెడు ఆశలు పెట్టుకున్న ఐఐటీయన్లు, ఇంజనీరింగ్ విద్యార్థులపై ఇప్పుడు కరోనా దెబ్బ భారీగా పడింది. దిగ్గజ కంపెనీలన్నీ తాజాగా కరోనా కారణంగా క్యాంపస్ రిక్రూట్ మెంట్లను తగ్గించాయి. ఐఐటీ విద్యార్థులను సైతం తీసుకోవడానికి బడా కార్పొరేట్ కంపెనీలు ముందుకు రావడం లేదు. దీంతో ఇక ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థుల పరిస్థితి దారుణంగా తయారైంది.
ఇన్నాళ్లు దేశంలో ప్రఖ్యాత ఐఐటీల్లో చదివే విద్యార్థులను బడా కార్పొరేట్ కంపెనీలైన గూగుల్, ఫేస్ బుక్, అమేజాన్ సహా పేరొందిన సంస్థలు కోట్లు కుమ్మరించి చివరి సంవత్సరం గడువక ముందే వారికి ప్లేస్ మెంట్స్ ఆర్డర్స్ ఇచ్చేవి. ఒక్కొక్కరికి 3 ప్లేస్ మెంట్స్ ఆర్డర్స్ వచ్చేవి. కానీ కరోనా కారణంగా ఈ ఏడాది ఐఐటీయన్లను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ప్రస్తుతం కంపెనీలు ఆసక్తి చూపడం లేదు. లాక్ డౌన్ తో కంపెనీలు షట్ డౌన్ కావడంతో ప్రస్తుతానికి రిక్రూట్ మెంట్లను కంపెనీలు నిలిపివేశాయి. ప్లేస్ మెంట్స్ ఇచ్చిన సంస్థలు కూడా విద్యార్థులను తీసుకోకుండా పక్కనపెట్టాయి.
ఐఐటీ చెన్నైలో 1331 విద్యార్థులకు గాను 924మందికి ఉద్యోగాలు లభించాయి. ఇంకా 30శాతం మందికి ఉద్యోగాలు రాలేదు. ఐఐటీ రూర్కీ విద్యార్థులకు ఇంటర్వ్యూలే జరగలేదు. తీసుకున్న వారికి ఆఫర్ లెటర్లను హోల్డ్ లో పెట్టేశాయి. ఐఐటీ బాంబే విద్యార్థుల ప్లేస్ మెంట్స్ ను జూలై వరకు పొడిగించారు. ఐఐటీ గాంధీనగర్ విద్యార్థులు 25శాతం ఆఫర్ లెటర్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇలా హాట్ కేకులైన ఐఐటీ విద్యార్థులనే బడా కంపెనీలు పట్టించుకోని పరిస్థితి నెలకొంది.