కరోనా మహమ్మారి అంతానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ఒక్కటే మన ముందున్న ఏకైక మార్గం. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ డ్రైవ్ ని ముమ్మరం చేశాయి. అందరికీ టీకాలు వేస్తున్నాయి. అయినా ఇప్పటికి ఇంకా కొంతమంది అనుమానాలు, సందేహాలు, అపోహలు, భయాలతో టీకాలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇలాంటి వారిలో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. దీనికోసం కొన్ని చోట్ల వ్యాక్సిన్ తీసుకుంటే పలు బహుమతులు ఇస్తామని ప్రకటిస్తున్నాయి , అలాగే మరికొన్ని చోట్ల నగదు బహుమతి కూడా ఇస్తున్నారు. అయితే , తాజాగా ఓ రాష్ట్రం మాత్రం ఓ సరికొత్త రూల్ ను తీసుకొచ్చింది.
వివరాల్లోకి వెళ్తే .. ఈ నేపథ్యం ఉత్తర ప్రదేశ్ లో ఇటావా జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా లాక్ డౌన్ ప్రకటించగానే లిక్కర్ షాపుల ముందు బారులు తీరే మందుబాబులకు షాకిచ్చేలా సంచలన నిర్ణయం తీసుకుంది. అదే.. నో వ్యాక్సిన్, నో లిక్కర్. లిక్కర్ షాపులకు ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే మందు అమ్మాలని లిక్కర్ షాపు యజమానులకు అధికారులు తేల్చి చెప్పారు. ఈ మేరకు అన్ని లిక్కర్ షాపుల బయట పోస్టర్లు అతికించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే లిక్కర్ అమ్ముతామని అందులో ఉంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసే క్రమంలో మద్యం సేవించాలనుకునేవారికి వ్యాక్సిన్ తీసుకోవడాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది.
ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో వారికి మాత్రమే లిక్కర్ అమ్మాలని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ మాకు ఆదేశాలు ఇచ్చారు అని లిక్కర్ షాపుల యజమానులు తెలిపారు. అందరూ వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించేందుకు తాము ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 13వేల 777 కరోనా కేసులు నమోదయ్యాయి. 279మంది కరోనాకు బలయ్యారు. 13వేల 200మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఇలాంటి ఉత్తర్వులేవీ తాము జారీ చేయలేదని ఇటావా జిల్లా ఎక్సైజ్ అధికారి కమల్ కుమార్ శుక్లా తెలిపారు. టీకాలు వేయడానికి జిల్లా యంత్రాంగం ప్రయత్నాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, అయితే మద్యం కొనుగోలుకు వ్యాక్సిన్ సర్టిఫికెట్లు తప్పనిసరి చేయమని ఆదేశించలేదని ఆయన అన్నారు.