బెంగళూరులో బయటపడ్డ డ్రగ్స్ కేసు లింకులు తెలంగాణ ఎమ్మెల్యే మెడకు చుట్టుకుంటున్నాయి. ఈ కేసులో విచారణను వేగవంతం చేసిన పోలీసులకు నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేలు చిక్కారు. ఈ మేరకు తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు త్వరలో ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్టు ప్రచారం సాగుతోంది.
వీరితోపాటు తెలంగాణకు చెందిన పలువురు వ్యాపారవేత్తలు, సెలబ్రెటీలపైనా బెంగళూరు తూర్పు విభాగం పోలీసులు దృష్టి సారించారు.
తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పలుమార్లు డ్రగ్స్ పార్టీలకు హాజరయ్యారని.. సరైన సాక్ష్యాధారాలు సేకరించిన అనంతరం వారికి నోటీసులు ఇస్తామని పోలీసులు తెలిపారు
అటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారి పేర్లు కూడా ఈ లిస్టులో ఉన్నట్లు పోలీసులు చెబుతుండగా.. ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ఫిబ్రవరి నెలలో శాండల్ వుడ్ కు చెందిన ఓ ప్రముఖ నటుడి హోటల్ లో డ్రగ్స్ పార్టీ జరిగిందని నిర్ధారించిన పోలీసులు అక్కడి సీసీటీవీ ఫుటేజీలను సేకరించారు. పార్టీ జరిగిన ప్రాంతంలో సీసీకెమెరాలు లేకున్నా.. ఆ సమయంలో హోటల్ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న కెమెరాల్లో ఇద్దరు తెలంగాణ ఎమ్మెల్యేలు, మరో ప్రజాప్రతినిధి, పలువురు ప్రముఖులు వచ్చినట్లు రికార్డ్ అయినట్లు సమాచారం. వారు డ్రగ్స్ తీసుకున్నారా? లేదా అనేది నిర్దారణ కావాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.