అమెరికా అల్లుడు.. ఎంత మోసం చేశాడు?
అమెరికా సంబంధమని 50 లక్షల కట్నం పోసి మరీ పెళ్లి చేశారు. అమ్మాయి పెళ్లి తర్వాత అగ్రరాజ్యం పోతుందని ఆ తల్లిదండ్రులు కలలుగన్నారు. తాహతుకు మించి ఘనంగా వివాహం జరిపించారు. అంతేకాదు.. ఏకంగా 50 సవర్ల బంగారాన్ని కూడా యువతి తల్లిదండ్రులు కట్నంగా ఇచ్చారు. ఇంకేముంది అంతా బాగానే ఉందనుకున్నారు..కానీ అసలు ట్విస్ట్ అప్పుడే మొదలైంది.
అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా చేస్తున్న ఓ యువకుడికి గుంటూరు జిల్లా ఏటి అగ్రహారానికి చెందిన యువతితో వివాహమైంది. ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆ నూతన వధువుకు మూడు రోజులకే భర్త అసలు విషయం తెలిసొచ్చింది.
పెళ్లైన మూడు రోజులకే తాను ‘గే’నని.. తనకు అమెరికాలో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని వరుడు బాంబు పేల్చాడు. దీంతో ఆ నవ వధువు కలలు కల్లలయ్యాయి. అంతటితో ఊరుకోక అదనపు కట్నం తేవాలంటూ భార్యను వేధించాడు. నెలరోజులు గడవకముందే తనకు భార్య అంటే ఇష్టం లేదని చెప్పి అమెరికా వెళ్లిపోయాడు.
దీంతో 50 లక్షలుపోయి.. 50 సవర్ల బంగారం పోయి భోరుమన్న నవ వధువు తాజాగా గుంటూరు అర్బన్ ఎస్పీని ఆశ్రయించింది. న్యాయం చేయాలని వేడుకుంది. కానీ ఆ గే వరుడు ఎప్పుడో దేశం దాటేశాడు.