ఈ నంబర్ వైసీపీకి లక్కీ నంబర్ అనుకుంటారు. కానీ అది పొలిటికల్ జాక్ పాట్ నంబర్ అని వైసీపీ భావిస్తోందిట. ఇంతకీ ఆ నంబర్ అంత పవర్ ఫుల్లా. దాని కధా కమామీషూ ఏంటి అంటే చాలానే ఉంది అంటున్నారు. ఆ నంబర్ ఏపీలో టీడీపీకి ప్రస్తుతం దక్కి మిగిలి ఉన్న ఎమ్మెల్యే సీట్లు. నికరంగా చెప్పాలీ చంద్రబాబు బాలయ్య సహా 18 మంది మాత్రమే ఏపీ అసెంబ్లీలో టీడీపీకి నంబర్ గా ఉన్నారు. టెక్నికల్ గా చూస్తే 23 సీట్లు కదా అని ఎవరైనా అనుకోవచ్చు కానీ నలుగురు పార్టీ ఫిరాయించారు. మరొకరు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కావచ్చు.
మొత్తానికి 18 సీట్లు కనుక గెలుచుకుంటే కచ్చితంగా వచ్చే ఎన్నికలలో 175 కి 175 సీట్లు తమ పరం అవుతాయని వైసీపీ గట్టిగా లెక్కలేవో వేసుకున్నట్లుగా ఉంది మరి. ఇదిలా ఉంటే చంద్రబాబు కుప్పంతో మొదలుపెట్టి అద్దంకి మీదుగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి దగ్గర జగన్ రివ్యూ ఆగింది. టెక్కలి అంటే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు సీటు. ఆయన ఇప్పటికి రెండు సార్లు ఇదే సీటు నుంచి గెలిచారు. అంతకు ముందు ఆయన హరిశ్చంద్రాపురం నుంచి గెలుస్తూ వచ్చారు. 2009లో బైఫరికేషన్ తరువాత ఆయనకు బలమున్న సంతబొమ్మాళీ వంటి మండలాలు వఛ్చి టెక్కలిలో కలిశాయి. దాంతో ఆయన టెక్కలిని ఎంచుకుని పోటీ చేశారు.
అయితే టెక్కలిలోఅచ్చెన్న మొదటి ఎన్నిక 2009లో ఆయన ఓడారు. కానీ 2014, 2019 ఎన్నికల్లో గెలిచారు. జగన్ కి అయితే ఆయన్ని మాజీ ఎమ్మెల్యే చేయాలని కోరికగా ఉంది. నిజానికి టెక్కలి సీటు శ్రీకాకుళం జిల్లాలో మరో బలమైన సామాజికవర్గంగా ఉన్న కాళింగులకు సేఫ్ జోన్ గా ఉంటూ వచ్చింది. ఎక్కువగా వారే గెలుస్తూ వచ్చారు. అయితే బైఫరికేషన్ తరువాత మాత్రం వారికి ఈ సీటు అందని పండు అయింది.
ఇప్పటికి చూస్తే కాళింగ నేతలు బలమైన వారు వైసీపీలో ఉన్నారు. టెక్కలికి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కి ఎమ్మెల్సీ ఇచ్చి జగన్ అక్కడ ఇంచార్జి గా కూడా చేశారు. అచ్చెన్న మీద ఆయన్నే 2024లో నిలబెడతారు అని అంటున్నారు. అయితే ఇక్కడ మూడు బలమైన వర్గాలు వైసీపీలో ఉన్నారు. దాంతో జగన్ అన్ని గ్రూపులను ఒక్కటి కమ్మని చెప్పి టెక్కలిలో ఈసారి ఎలాగైనా గెలవాలని చూస్తున్నారు.
ఇక దీని తరువాత ఇచ్చాపురం సీటు మీద కూడా జగన్ మార్క్ రివ్యూ ఉంటుంది అని అంటున్నారు. అలాగే విశాఖ తూర్పు, పశ్చిమ సీట్లలో కూడా జగన్ రివ్యూస్ పెట్టి మరీ అక్కడ సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేలను ఓడించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తారని అంటున్నారు. ఇవన్నీ సరే కానీ 151 సీట్లు 2019 ఎన్నికల్లో వైసీపీకి ఇచ్చారు. అయిదుగురు ఆ పార్టీ జెండా ఎత్తారు.
మరి ఈ 156 సీట్లలో వైసీపీకి తిరుగులేదనా. కచ్చితంగా 2024లో ఈ సీట్లు వైసీపీ పరం అవుతాయన్న ధీమానా అన్న చర్చ సాగుతోంది. ఎన్నిక ఎన్నికలూ ఎన్నో మార్పులు ఉంటాయి. కేవలం టీడీపీ గెలిచిన సీట్ల మీదనే ఫోకస్ పెడితే వైసీపీ గెలిచిన సీట్లలో రేపటి రాజకీయం ఏంటి అన్న చర్చ అయితే సాగుతోంది మరి. చూడాలి ఏ జరుగుతుందో. ఏదేమైనా వైసీపీ టార్గెట్ మరీ ఇంత సింపుల్ నంబరా అన్న సెటైర్లు అయితే పడుతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.