ఒబామా వార్ః ర‌ష్యా రాయ‌బారులు ఔట్‌

Update: 2016-12-30 10:59 GMT
అమెరికా-ర‌ష్యాల మ‌ధ్య కొన‌సాగుతున్న కోల్డ్ వార్ తారాస్థాయికి చేరింది. ర‌ష్యా విష‌యంలో అమెరికా అధ్యక్షుడు బ‌రాక్ ఒబామా క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌ష్యా రాయ‌బారుల‌ను త‌మ దేశం నుంచి వెలివేశారు. సుమారు 35 మంది రాయ‌బారుల‌ను వెన‌క్కి పంపిచాలంటూ అమెరికా దేశ అధికారులకు ఒబామా ఆదేశాలు జారీ చేశారు. ఈ ప‌రిణామం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టిస్తోంది.

ఇటీవ‌ల జ‌రిగిన అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల స‌మ‌యంలో ర‌ష్యా హ్యాకింగ్‌ కు పాల్ప‌డింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. రష్యాకు చెందిన రెండు ఇంటెలిజెన్స్ సంస్థ‌ల‌పైన కూడా అమెరికా క‌ఠిన‌మైన ఆంక్ష‌ల‌ను విధించింది. ర‌ష్యా మిలిటరీకి చెందిన జీఆర్‌ యూ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో ప‌నిచేస్తున్న న‌లుగురు అత్యున్న‌త స్థాయి అధికారుల‌ను కూడా వెలివేస్తూ అమెరికా నిర్ణ‌యం తీసుకుంది. అమెరికా ఎన్నిక‌ల వేళ డెమోక్ర‌టిక్ పార్టీకి చెందిన కంప్యూట‌ర్ల‌ను హ్యాక్ చేయాలంటూ జీఆర్‌ యూ ఏజెన్సీనే ఆదేశాలు జారీ చేసిన‌ట్లు ఒబామా ప్ర‌భుత్వం తేల్చిచెప్పింది. క్రెమ్లిన్ ఆదేశాల మేరుకు హ్యాకింగ్ జ‌రిగిన‌ట్లు కూడా అమెరికా ప్ర‌భుత్వాధికారులు దృవీక‌రించారు. రాయ‌బారులంటూ సుమారు 35 మంది గూఢాచారులు అమెరికాకు వ్య‌తిరేకంగా ప‌నిచేశార‌ని ఒబామా ప్ర‌భుత్వం త‌న రిపోర్ట్‌ లో పేర్కొంది. ర‌ష్యా ఇంటెలిజెన్స్ అధికారులు నివాసం ఉంటున్న రెండు ఎస్టేట్ల‌ను మూసివేస్తున్న‌ట్లు కూడా స్టేట్ డిపార్ట్‌ మెంట్ వెల్ల‌డించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News