నాడు రిక్షావాడు.. నేడు క‌లెక్ట‌ర్‌.. ఏం జ‌రిగిందంటే!

Update: 2021-11-28 13:30 GMT
బంధం.. బ‌రువ‌వుతోంది! క‌న్న వారిని ప‌ట్టించుకునే తీరిక‌.. సాకే ఓపిక క‌రువ‌వుతోంది. ఫ‌లితంగా.. ఒక‌ప్ప‌టి పెద్ద‌ల మాదిరిగా ఇప్పుడు పెద్ద‌లు ఆలోచించ‌డం లేదు. త‌మ‌ను ప‌ట్టించుకోనివారిని తాము మాత్రం ఎందుకు ప‌ట్టించుకోవాల‌నే ఆలోచ‌న చేస్తున్నారు. క‌న్నాం.. సాకాం.. పెద్ద‌వాళ్ల‌ను చేశాం.. మ‌రి మ‌మ్మ‌ల్ని పట్టించుకోరా?! అని పెద్ద‌ల గొంతులు ప్ర‌శ్నిస్తున్నాయి. ప‌ట్టించుకోమంటే.. మేం చేసేది మేం చేస్తాం.. అంటూ.. సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుని.. కుటుంబాల‌కు షాకిస్తున్నారు. ఇది ఒక‌వైపు.. పెద్ద‌ల‌కు ఆనందం మిగుల్చుతున్నా.. క‌న్న‌వారికి జ‌రుగుతున్న.. వారు చేస్తున్న అన్యాయం చ‌ర్చ‌కు దారితీస్తోంది.

వృద్ధాప్యంలో కుటుంబ పెద్ద‌ల‌ను చూసుకునే సంస్కృతి మ‌న‌ది. అయితే.. ఫారిన్ క‌ల్చ‌ర్ కార‌ణంగా.. వృద్ధాశ్ర‌మాలు వెల్లివిరిసా  యి. అయితే.. వీటిలో ఉండేందుకు ఇష్ట‌ప‌డని పెద్ద‌ల‌ను  కుటుంబ స‌భ్యులు ఏదొ ఒక విధంగా వ‌దుల్చుకునే ప్ర‌య‌త్నం చేస్తు న్నారు. దీంతో మాన‌సికంగా తీవ్ర గంద‌ర‌గోళానికి గుర‌వుతున్న పెద్ద‌లు.. త‌మ చేతుల్లో ఉన్న కోట్ల రూపాయ‌ల ఆస్తుల‌ను చివ‌రి నిముషంలో త‌మ‌కు అండ‌గా ఉన్న‌వారికి.. రాసేస్తున్నారు. వారు కుటుంబ స‌భ్యులు కాక‌పోయినా.. తాము క‌ష్ట‌ప‌డి సంపాయిం చిన సొమ్మును సంతోషంగా ఇచ్చేస్తున్నారు. ఇటీవ‌ల ఒక రిక్షా పుల్ల‌ర్ విష‌యం వెలుగు చూసి.. అంద‌రూ ఆశ్చ‌ర్య పోగా.. ఇప్పుడు క‌లెక్ట‌ర్ వంతు వ‌చ్చింది.

నిన్న‌.. ఏం జ‌రిగిందంటే..

ఒడిశా రాష్ట్రం కటక్‌ సమీపంలోని సంబల్‌పుర్‌కు చెందిన మినతి పట్నాయక్‌ (63) భర్తతో కలసి కటక్‌లోని సుతాహత్‌ క్రిస్టియన్‌ సాహిలో నివసిస్తున్నారు. వారి ఏకైక కుమార్తెకు పెళ్లి చేసి సంతోషంగా గడపాలని దంపతులు భావించారు. పెళ్లి సామగ్రిని సిద్ధం చేశారు. అంతలోనే ఆమె భర్త అనారోగ్యానికి గురై 2020 జులైలో చనిపోయారు. 2021లో ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో కుమార్తెను కూడా వృద్ధురాలు కోల్పోయారు. అప్పటివరకు పట్టించుకోని అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఆస్తి కోసం ఆమెకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. సందిగ్ధానికి తావు లేకుండా తనకున్న రూ.కోటి విలువైన మూడంతస్తుల భవనం, ఇతర సామగ్రిని రిక్షా కార్మికుడు బుడ సామల్‌కు వీలునామా రాయించి రిజిస్ట్రేషన్‌ చేయించారు.

రిక్షాకార్మికుడైన సామల్‌ కుటుంబం 25 ఏళ్లుగా తమకు తోడుగా ఉంటోందని, తన కుమార్తెను అతడు పాఠశాలకు తీసుకెళ్లేవాడ ని వృద్ధురాలు గుర్తు చేసుకున్నారు. మందులు, కూరగాయలు, నిత్యావసరాలు తెచ్చేవాడని.. తన భర్త అనారోగ్యం పాలైనప్పు డు ఎంతో సాయం చేశాడని వివరించారు. రక్తసంబంధం లేకున్నా తమకు చేసిన సేవలకు బహుమతిగా అతడి కుటుంబానికి మంచి చేయాలనిపించిందని పేర్కొన్నారు. 4 నెలల నుంచి సామల్‌ కుటుంబం తనతో ఉంటోందని, సరదాగా గడిచిపోతోందని, చివరి వరకు ఆ కుటుంబంతోనే కలసి జీవిస్తానని ఆమె చెప్పి.. అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచ‌త్తారు.

ఇప్పుడు జ‌రిగిందిదే!

ఆగ్రాలోని  నీరాలబాద్ పీపల్ మండి ప్రాంతానికి చెందిన 88 ఏళ్ల గణేశ్ శంకర్ పాండే... తన ఆస్తిని కలెక్టర్ పేరు మీద రాశారు. తన సోదరులు నరేశ్ శంకర్ పాండే, రఘునాథ్ శంర్ పాండే, అజయ్ శంకర్ పాండేతో కలిసి గణేశ్ శంకర్ పాండే.. 1983 మార్చి 30న 1000 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ తర్వాత తన సోదరులు విడిపోయారు. ఆ భూమిలో తన వాటాగా దక్కిన భూమిని 2018 ఆగస్టు 4న ఆగ్రా కలెక్టర్ పేరు మీద వీలునామా  రాశారు గణేశ్ శంకర్ పాండే. ఇందుకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలను గణేశ్ శంకర్.. కలెక్టర్కు అప్పగించేందుకు వచ్చారు. ఈ భూమి విలువ రూ.2 కోట్లు ఉంటుందని అంచనా.

సొంత కుటుంబ సభ్యులే గ‌ణేశ్ శంక‌ర్‌ను ఇంట్లో నుంచి తరిమేశారు. పట్టించుకునే వాళ్లు కరవై ఆ పెద్దాయన ఎక్కడెక్కడో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తన పేరు మీద ఉన్న రూ.2 కోట్ల ఆస్తిని.. తన కుటుంబానికి దక్కకూడదని భావించాడు. దాంతో ఆ ఆస్తి మొత్తాన్ని జిల్లా కలెక్టర్ పేరు మీద వీలునామా రాశాడు. తన చివ‌రి రోజుల‌ను క‌లెక్ట‌ర్ చూడాల‌ని ఆయ‌న విన్న‌వించారు. ఇదీ.. జ‌రిగింది.
Tags:    

Similar News