కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన 2022-23 వార్షిక బడ్జెట్లో క్రిప్టో కరెన్సీ, డిజిటల్ కరెన్సీలపై పన్నుల మోత మోగించింది. క్రిప్టో కరెన్సీపై ఏకంగా 30 శాతం పన్నులు వేసేసింది. ఇక, డిజిటల్ రూపంలో సంపాయించుకునే ప్రతిరూపాయికీ పన్ను ఉంటుందని.. లావాదేవీలు ఏరూపంలో చేసినా.. పన్నులు చెల్లించాల్సిందేనని తాజాగా ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇక, స్వయం సమృద్ధిలో భాగంగా కస్టమ్స్ సుంకాల హేతుబద్ధత తీసుకురానున్నట్టు చెప్పారు.
స్థానిక పరిశ్రమలకు నష్టం కలగకుండా కస్టమ్స్ సుంకాల హేతుబద్ధీకరణ ఉంటుందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా కస్టమ్స్ సుంకాల హేతుబద్ధీకరణ తీసుకువస్తున్నామన్నారు. జీఎస్టీతో ఒకే దేశం ఒకే పన్ను అన్న కల నెరవేరిందనని మంత్రి చెప్పారు..
జీఎస్టీలో ఇప్పటివరకు కొన్ని సమస్యలు ఉన్నా సవ్యదిశలోనే ముందుకు సాగుతున్నామన్నారు. జీఎస్టీ 2022 జనవరిలో జీఎస్టీ వసూలు రూ.1.43 లక్షల కోట్లు వచ్చిందన్నారు. జీఎస్టీ ప్రవేశ పెట్టినప్పటి నుంచి ఇదే అత్యధిక ఆదాయమని వివరించారు..
ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం చెందింది అనేందుకు ఇదే ఉదాహరణగా నిర్మల పేర్కొన్నారు. బయటపెట్టని ఆదాయం, సోదాల్లో దొరికినప్పుడు కఠినమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎలాంటి చట్టాలనుంచి కూడా మినహాయింపు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. సాగునీటి వసతులకు, ఆర్గానిక్ వ్యవసాయానికి, చిన్న సూక్ష్మ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తున్నట్టు చెప్పారు.
అయితే.. మొత్తంగా చూస్తే.. డ్రోన్ వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నట్టు నిర్మల చెప్పారు. వచ్చే 50 ఏళ్లపాటు.. రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్టు మంత్రి తెలిపారు.. అయితే.. ఆదాయపన్ను పరిధి(శ్లాబ్) పెంచుతారని ఎదురు చూసిన ఉద్యోగులకు మాత్రం నిరాశే ఎదురైంది. ఈ విషయాన్ని అసలు బడ్జెట్‌లో ప్రస్తావించలేదు.