కేంద్రంలో మరో ఎన్నికల జోరు మొదలైంది. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావడం, మరో వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్డీఏ పక్షాలతో ప్రత్యేక భేటీ నిర్వహించిన నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నిక అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. రాష్ట్రపతి పదవికి జరిగే వచ్చే జూన్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా పార్టీల బలాబలాలు బేరీజు వేస్తున్నారు. తాజా సమీకరణాల ప్రకారం ప్రస్తుతం ఉన్న పార్టీల బలాబలాలను పరిగణనలోనికి తీసుకుంటే అధికార ఎన్డీయే కూటమి బలమే ఎక్కువ ఉంది.
రాష్ట్రపతి ఎన్నికల కోసం మొత్తం విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి అభ్యర్థిని రంగంలోనికి దింపినా కూడా ఎలక్టోరల్ కాలేజీలో విపక్ష కూటమికి ఉన్న ఓట్ల కంటే ఎన్డీయేకు 13శాతం ఓట్లు అధికంగా ఉన్నాయి. ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ బలం అనూహ్యంగా పెరిగింది. అయితే ఈ 13 శాతం ఆధిక్యతనూ ఇటు అధికార కూటమిలోనూ, అటు విపక్ష కూటమిలోనూ లేని 13 పార్టీలు తారుమారు చేసు అవకాశం ఉంది. ఆయా పార్టీలు తీసుకునే వైఖరిని బట్టి ఎన్డీయే కూటమి బలం పెరగవచ్చు, లేదా తగ్గవచ్చు. అందుకే ప్రాంతీయ పార్టీలను కలుపుకొని పోయే విధంగా ఎన్డీఏ రథసారథి - ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పావులు కదుపుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/