ఓవ‌ర్ టు విష్వ‌క్ : జెండ‌ర్ సెన్సిటివిటి అంటే..?

Update: 2022-05-05 07:30 GMT
మ‌నుషులంతా ఒక్క‌టే అని చెప్ప‌డంలో అర్థం ఉంది. అర్థంతో కూడిన స‌వ‌ర‌ణ కూడా ఉండే ఉంటుంది. అర్థ సంబంధ వివ‌ర‌ణ  కూడా ఉండే ఉంటుంది. వివ‌ర‌ణ అయినా, స‌వ‌ర‌ణ అయినా కాలం మారుతున్న కొద్దీ మారిపోతుంటాయి. ఆ విధంగా మ‌నుషుల‌కు ఇప్ప‌టి క‌న్నా మంచి బుద్ధి మ‌రియు జ్ఞానం ఉండాల‌ని కోరుకోవ‌డం లో అస్స‌లు త‌ప్పే లేదు. కానీ వీటిని మ‌రిచిపోయి కొన్ని సంద‌ర్భాల్లో అస‌హ‌న రీతుల్లో మ‌నుషులు స్పందిస్తుంటారు క‌దా! అప్పుడు కూడా న‌వ్వుకోండి ఏం కాదు. కానీ సాధించాల్సినంత సాధించాక సెన్సిటివిటీ అన్న వ‌ర్డ్ ను వాడుకోండి. త‌ప్పేం లేదు. మీకు న‌చ్చిన ప‌దాలు మీకు న‌చ్చిన విధంగా మీ హృదయాల‌కు హ‌త్తుకునే విధంగా వాడుకోండి. ఈ లోగా జ‌ర‌గాల్సిన అన్యాయం జ‌ర‌గాల్సిన హింస చేయాల్సిన జుగుప్స అన్న‌వి త‌ప్పక బ‌య‌ట ప‌డిపోతాయి. అందుకే ప్రముఖ టీవీ ఛానెల్-కు మ‌రియు ఇంకొంద‌రికి  చేసే విజ్ఞాప‌న ఏంటంటే నొప్పి మీదే కాదు మాది కూడా అని !

క‌నుక ఓ ప్ర‌ముఖ యాంక‌ర్ లేదా ఓ ఫెమిలియ‌ర్ నౌన్ జెండ‌ర్ సెన్సిటివిటీని బ‌య‌ట‌కు తెచ్చారు. దీనినే అడ్డుకుని మాట్లాడితే ఆయ‌న‌ను ఉద్దేశించి ఆమె చెప్పినా లేదా అవ‌మానాల‌కు గురిచేసేలా చేసిన మాట‌లకు ఏ అర్థం ఇవ్వాలో కూడా వివ‌రిస్తే త‌ప్ప‌క సంతోషిస్తాం. లేదండి ఇదంతా టీఆర్పీ గోల కోసం అంటే ఏం చేయలేం.

ఇక ఓ సంద‌ర్భంగా విష్వక్ వాడిన ప‌ద‌మే ఓ న‌వ‌ల‌లో చ‌దివాను. ఆ రోజు నేను నా అజ్ఞానంతో ఉండి చ‌దివాను. కానీ ఆ ప‌దం జ‌స్ట్ ఏ సెన్స్ లో వాడారో అర్థం చేసుకుని మాట్లాడాలి అని ఒక‌రు చెప్పారు. అలా అని విష్వ‌క్ మీరు తిట్టండి నేను ఆనందిస్తాను అని అన‌డం లేదు కానీ.. ఆ మాట‌ను ఏ సెన్స్ తో వాడారు అన్న‌ది కూడా చూడండి అని అంటున్నానంతే! ఇదే మాట అదే ప్రముఖ ఛానెల్‌లో ప‌నిచేసిన ప‌తంజ‌లి కూడా చెప్పారు. ప్ర‌పంచ స్థాయి సాహిత్యం చ‌దివితే కొన్ని తెలుస్తాయి.. అప్పుడు రావి శాస్త్రి బూతులు, స్థానిక మాండ‌లిక ప్ర‌ధాన సంభాష‌ణ‌ల్లో ఉండే ప‌దాలు, శ్రీ‌శ్రీ బూతులు, అలానే ఇంకొంద‌రి బూతులు కూడా మీకు అర్థం అవుతాయి అని చెప్పేరు.. క‌నుక ఆ .. యాంక‌ర్ భాష బాగుంది అని  చెప్ప‌ను.. అయ్యో ఆ ప‌ని నాది కాదు నేను చేయ‌ను. విష్వ‌క్ భాష బాగుంది అని  చెప్ప‌ను అది నా ప‌ని కాదు. అస‌లు ఇత‌రుల‌ను జ‌డ్జ్ చేయ‌కుండా యాంక‌రింగ్ చేయ‌డ‌మో లేదా ర‌చ‌నా వ్యాసాంగం కొన‌సాగించ‌డ‌మే ఎందుకో మ‌న స‌మాజం చేయ‌డం లేదు. ఆ ప‌ని చేస్తే  ఇక ఎవ‌రి ప‌ని వారు చేసుకున్న విధంగానే భావింప వ‌చ్చు. అందాక దేవ దేవుడికో సాష్టాంగ ప్ర‌ణామం.
Tags:    

Similar News