భారతదేశాన్ని వణికించే రీతిలో రూపొందించామంటూ పాకిస్థాన్ చెబుతున్న బాబర్ మిస్సైల్ లాంచ్ ఉత్తిదే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ నేవల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ లో ఇది మైలురాయి అని.. బాబర్ మిస్సైల్ లాంచ్ సక్సెసైందని పాకిస్థాన్ ట్వీట్ చేసిన మరుసటి రోజే ఆ వీడియో ఫేక్ అన్న వార్తలు రావడం గమనార్హం. ఓ సబ్ మెరైన్ నుంచి లాంచ్ అయిన మిస్సైల్ తన లక్ష్యాన్ని తాకినట్లుగా ఆ వీడియోలో ఉంది. ఈ వీడియోలో రెండు మిస్సైల్స్ కనిపించాయి. ఒక గ్రే కలర్ లో - మరొకటి ఆరెంజ్ కలర్ లో ఉంది. అయితే ఇలాంటి పరీక్షలను క్షుణ్నంగా పరిశీలించే ఇండియన్ నేవీలోని విభాగం అధికారులు మాత్రం.. పాకిస్థాన్ లో ఎలాంటి క్షిపణి పరీక్ష జరగలేదని స్పష్టం చేస్తున్నారు. పాకిస్తాన్ చూపించిన వీడియో పాతది కావచ్చని ఇండియన్ నేవీలో అధికారులు విశ్లేషిస్తున్నారు.
కాగా.. పాకిస్తాన్ ప్రయోగించినట్లు చెప్తున్న బాబర్ సబ్ మెరైన్ లాంచ్ చేసే మిస్సైల్. దీనిని నీళ్లలో తేలియాడే ప్లాట్‌ఫామ్ నుంచి లాంచ్ చేసినట్లు వీడియోలో కనిపించింది. ఈ బాబర్ మిస్సైల్ తో తమ న్యూక్లియర్ త్రయం పరీక్షలు పూర్తయ్యాయని పాకిస్థాన్ ప్రకటించుకుంది. ఇప్పటికే ఉపరితలం నుంచి ప్రయోగించగలిగే బాలిస్టిక్ మిస్సైల్, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి జారవిడవగలిగే బాంబులను కూడా పాకిస్థాన్ పరీక్షించింది. బాబర్ మిస్సైల్ పరిధి 450 కిలోమీటర్లు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/