సర్జికల్ దాడి జరగలేదన్న పాక్ ఏం చేసిందంటే..

Update: 2016-10-02 10:24 GMT
పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్ దాడులు చేయటం తెలిసిందే. ఈ ఉదంతాన్ని మొదటి నుంచీ బలంగా తిప్పి కొడుతున్న పాకిస్థాన్.. తన వాదన నిజమని నమ్మించేందుకు సరికొత్త పనిని చేపట్టింది. భారత్ చేస్తున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదని.. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత బలగాలు ఎలాంటి దాడులు చేయలేదని.. ఉత్తగా ప్రచారం చేసుకుంటుందే తప్పించి.. ఆ వాదనలో నిజం లేదంటూ వాదిస్తున్న పాక్.. తాజాగా అంతర్జాతీయ మీడియా సిబ్బందిని తీసుకొని సరిహద్దు ప్రాంతాలకు తీసుకెళుతోంది.

అంతర్జాతీయ మీడియా ప్రతినిధులను తన సరిహద్దు ప్రాంతాల్లోకి తీసుకెళ్లి.. అక్కడి పరిస్థితుల్నిచూపించే ప్రయత్నం చాలా అరుదుగా జరిగే పరిణామంగా పలువురు చెబుతున్నారు. భారత్ చెబుతున్నట్లుగా సర్జికల్ దాడులు జరిగిందే లేదని.. పాక్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ ఆసిమ్ బజ్వా మీడియా ప్రతినిధులకు చెప్పినట్లుగా పాక్ మీడియా సంస్థ డాన్ పేర్కొనటం గమనార్హం.

సున్నితమైన అంశాల మీద ప్రకటనలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలంటూ భారత సైనిక దళాలకు పాక్ సుద్దులు చెప్పే ప్రయత్నం చేస్తుంది. తమ వద్ద సర్జికల్ దాడులు జరగలేదని.. భవిష్యత్ లో కూడా జరగనివ్వమని చెబుతున్న వారు.. దాడులు జరిగిన ప్రాంతాల్లోకి వెళ్లి.. అక్కడి సాధారణ పౌరుల్ని కూడా కలవొచ్చని పాక్ చెబుతోంది. మొత్తంగా 20 మీడియా సంస్థలకు చెందిన 40 మంది మీడియా ప్రతినిధుల్ని తీసుకెళ్లిన పాక్.. సరిహద్దు ప్రాంతాల్ని చూపించి.. అక్కడి వారితో మాట్లాడించింది. అయితే.. అక్కడి స్థానికులు చెప్పే మాటలు నమ్మేలా లేవన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సర్జికల్ దాడులు జరగలేదన్న తన వాదనను మరింత పెంచటం ద్వారా.. కొత్త సందేహాలు సృష్టించేలా పాక్ తీరు ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News