టీ 20 ప్రపంచ కప్ నుంచి అవమానకర రీతిలో నిష్క్రమించిన పాకిస్థాన్ జట్టు తాజాగా స్వదేశానికి చేరుకుంది. కాకుంటే.. పాక్ క్రికెట్ జట్టు స్వదేశానికి చేరుకున్నా.. ఆ టీం కెప్టెన్ మాత్రం మిస్ కావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇండియా నుంచి బయలుదేరిన పాక్ క్రికెట్ జట్టులో కెప్టెన్ అఫ్రిదీ ఉన్నారు. అయితే.. విమానం పాక్ కు చేరేసరికి మాత్రం ఆయన లేకపోవటం గమనార్హం.
టీ 20 వరల్డ్ కప్ లో తన మాటలు.. ఆట తీరుపై పాకిస్థానీయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్న సందేహంతో అఫ్రిదీ దుబాయ్ లో ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. స్వదేశానికి వెళ్లితే తనపై దాడులు పక్కా అన్న ఉద్దేశంతోనే ఆయన దుబాయ్ లో ఉండిపోయి ఉంటారని చెబుతున్నారు. నిజానికి ఇలాంటి పరిస్థితి ఏ క్రీడాకారుడికి రాకూడనిది. కానీ.. అఫ్రిదీ మాత్రం దీన్నించి తప్పించుకోలేకున్నారని చెప్పక తప్పదు.