హోదా సాధన కోసం శాంతియుతంగా నిరసన ధర్నా చేయాలని తలపెట్టిన ఏపీ యువత ఆశలపై నీళ్లు చల్లుతూ ఏపీ సర్కారు తన అధికార బలాన్ని ప్రదర్శిస్తోంది. విశాఖలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ.. కర్ఫ్యూ కంటే దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్లమీదకు ఎవరూ రాకుండా చేయటమే కాదు.. ఎవరైనా వస్తే వారిని వెళ్లిపోవాలంటూ పోలీసులు చేస్తున్న హెచ్చరికలు అన్నిఇన్ని కావన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. పోలీసుల హడావుడి సరిపోదన్నట్లుగా యలమంచలి టీడీపీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు వ్యవహరించిన తీరు వేలెత్తి చూపేలా ఉంది. కారులో అనుచర వర్గాన్ని వేసుకొని తిరిగి ఆయన.. వీధుల్లోకి వచ్చి.. ఆందోళన చేసేందుకు వచ్చే విద్యార్థుల్ని అదుపులోకి తీసుకోవాలంటూ పోలీసులకు ఆదేశాలు ఇవ్వటం గమనార్హం.
వాహనంలో తిరుగుతూ.. శాంతి ధర్నా చేసేందుకు ఎక్కడైనా.. ఎవరైనా కనిపిస్తే.. వారికి సంబంధించిన సమాచారం పోలీసులకు ఇస్తూ.. వారిని అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు చెబుతున్నారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని భావిస్తున్న ధర్నాను ఎంతగా దెబ్బ తీయాలో అంతగా దెబ్బ తీసేందుకు శక్తివంచన లేకుండా వ్యవహరించిన వైఖరి విమర్శలు వెల్లువెత్తేలా చేస్తోంది.