ఏపీలో రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న కరోనా కేసులు ..ఈ రోజు ఎన్నంటే ?

Update: 2020-07-24 12:56 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా వైరస్ మహమ్మారి కేసులు నమోదు అవుతున్నాయి. ప్రతి రోజూ రికార్డులు బద్దలయ్యేలా కరోనా కేసులు నమోదవుతున్నాయి రోజు రోజుకీ కొత్త కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఏపీ ప్ర‌భుత్వం కూడా క‌రోనా క‌ట్ట‌డికి చర్యలు తీసుకుంటుంది. ఇక ప‌లు జిల్లాలోని ప్ర‌జ‌లు స్వ‌యంగా లాక్ డౌన్ కూడా విధించుకుంటున్నారు. రాష్ట్రంలో ఇప్ప‌టికే ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్ర‌జా ప్ర‌తినిధులు కరోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే.

ఇకపోతే , గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 8147 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 80858కి పెరిగింది. ఏపీలో నిన్న 7998 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు ఆ రికార్డు కూడా బ్రేక్ చేసి కొత్తగా మరో 8147 కేసులు నమోదయ్యాయి.గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 49 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 933కి చేరింది. కాగా, గత 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా మరోసారి 1029 కరోనా కేసులు వచ్చాయి. కొత్త కేసులతో కలిపి తూర్పుగోదావరి జిల్లాలోమొత్తం కేసుల సంఖ్య 11067 కి చేరింది. ఆ తర్వాత అనంతపురంలో 984 కరోనా కేసులు , కర్నూలు జిల్లాలో కూడా 914 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం 80,858 పాజిటివ్ కేసులకు గాను 39,935 మంది డిశ్చార్జ్ కాగా, 39,990 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Tags:    

Similar News