కులాంతర వివాహాలు - ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలను హత్య చేస్తున్న ఉదంతాల సంఖ్య పెరుగుతోంది. అనునిత్యం ఏదో ఒక చోట ప్రేమ జంటల హత్యలు - పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లాలో పరువు హత్య జరిగింది. కన్నవాళ్లే కూతురిని కడతేర్చారు. ప్రేమ వివాహం చేసుకుందని కన్న కూతురిని తల్లిదండ్రులు దారుణంగా హత మార్చారు. ఆమెను కొట్టి చంపారు. మృతదేహాన్ని తల్లిదండ్రులు దహనం చేశారు.
పోలీసుల కథనం ప్రకారం... మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలం కలమడుగు గ్రామంలో పిండి అనురాధ - లక్ష్మణ్ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. విషయాన్ని అనురాధ తల్లిదండ్రులకు చెప్పారు. అయితే వారు ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో తల్లిదండ్రులను ఎదురించి అనురాధ - లక్ష్మణ్ ఈనెల 3న హైదరాబాద్ లోని ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. 13 రోజులు కాపురం చేసిన తర్వాత వారు పోలీసుల ప్రొటెక్షన్ అడిగారు. పోలీసుల ప్రొటెక్షన్ తో అనురాధ - లక్ష్మణ్ లను నిన్న సాయంత్రం కలమడుగు గ్రామానికి పంపించారు. అయితే తల్లిదండ్రులను కలిసి వస్తానని అనురాధ వారి ఇంటికి వెళ్లింది. ఆమె తల్లిదండ్రులు - అన్నయ్య - బంధువులు అనురాధను తీసుకుని లక్ష్మణ్ ఇంటికి వెళ్లారు. అక్కడ గొడవ పడి - అనురాధను కొట్టుకుంటూ తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
తమను కాదని ప్రేమ వివాహం చేసుకున్నందుకు నిన్న రాత్రి 11 గంటలకు అమ్మాయిని ఊరి శివారులోని గుట్టపక్కన నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి - తల్లిదండ్రులు అనురాధను దారుణంగా కొట్టి చంపారు. ఆనవాళ్లు లేకుండా చేయడం కోసం మృతదేహాన్ని కాల్చి వేశారు.
ఈ జుగుప్సాకర ఘటనపై సమాచారం అందుకున్న మంచిర్యాల డీసీపీ వేణుగోపాలరావు - ఏసీపీ గౌస్ పాషా ఘటనాస్థలికి చేరుకుని - పరిశీలించారు. ఘటనాస్థలికి చేరుకుని - పరిశీలించారు. పోలీసులకు - డాగ్ స్క్వాడ్స్ కు ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా చేసినట్లు కనిపిస్తోంది. అనురాధ తల్లిని - తండ్రి సత్తయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని - పోలీసుస్టేషన్ కు తరలించారు. అనురాధ అన్నయ్య అప్ స్టాండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి - దర్యాప్తు చేస్తున్నారు. అనురాధ భర్తకు సంబంధించిన కుటుంబం బయటికి రాలేదు. అనురాధ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పోలీసులు ఆమె ఫేస్ బుక్ ఖాతాలో నుంచి వీడియోను బయటికి తీశారు.