వినేందుకే వెగటుగా అనిపిస్తుంది కానీ ఇది చేదునిజం. ఇవాల్టి రోజున ఇంట్లో అమ్మాయిలు ఉంటేనే కాదు.. అబ్బాయిలున్నా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని చెప్పే ఉదంతంగా దీన్ని చెప్పాలి. అమ్మాయిల్ని భద్రంగా చూసుకుంటే సరిపోతుంది. కానీ.. అబ్బాయిల విషయంలో ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కొన్ని ఎంతకూ మింగుడుపడని రీతిలో ఉంటున్నాయని చెప్పాలి.
తాజాగా 13 ఏళ్ల బాలుడిపై గడిచిన ఏడు నెలలుగా ఆరుగురు వ్యక్తులు అత్యాచారం చేస్తున్న దారుణ వాస్తవం ఒకటి బయటకు వచ్చింది. సూర్యాపేట జిల్లా కోదాడలో కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతం ఎంతకూ మింగుడుపడనిదిగా ఉందని చెప్పక తప్పదు. కోదాడ పట్టణంలో తన తోటి స్నేహితుల కారణంగా పదమూడేళ్ల బాలుడు గడిచిన ఏడు నెలలుగా అత్యాచారానికి గురి అవుతున్నాడు.
క్రికెట్ ఆడదామని చెప్పి రహస్య ప్రాంతానికి తీసుకెళుతున్న వారు.. ఆ బాలుడిపై ఆఘాయిత్యానికి పాల్పడుతున్నారు. బాలుడి ప్రవర్తనలో మార్పు రావటాన్ని గుర్తించిన తల్లిదండ్రుల్ని అతడ్ని ఆరా తీయగా.. జరుగుతున్న దారుణాన్ని ఆ బాలుడు చెప్పేశాడు. దీంతో ఆరుగురు నిందితులపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ఆరుగురిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అందులో ఐదుగురిని జువైనల్ హోం కు మరొకరికి రిమాండ్ కు పంపారు. నిందితుల్లో ఐదుగురు మైనర్లు ఉండగా.. ఒకరు మేజర్ గా తేలింది. ఇంట్లో అబ్బాయిలు ఉన్న తల్లిదండ్రులు సైతం తమ పిల్లాడు ఎక్కడికి వెళుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏం చేస్తున్నాడు? లాంటివి ఆరా తీయాల్సిన తప్పనిసరి పరిస్థితి. లేదంటే ఏదో ఒక ప్రమాదంలో ఇరుక్కోవటం ఖాయమన్నది మర్చిపోకూడదు.