ప‌రిటాల సునీతకే.... బాబు ఓటు

Update: 2019-03-14 12:29 GMT
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నగరా మ్రోగింది. రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా టిక్కెట్ల కోసం తమ నేతల ఇళ్ల ముందర పడిగాపులు కాస్తున్నారు. సీనియర్ నాయకులైతే తమతో పాటు తమ కుమారుడికో, కోడలికో లేక తమ భార్యకో టిక్కెట్లు ఇవ్వాల్సిందిగా తమ అధినేతపై వత్తిడి తెస్తున్నారు. సీనియర్లకు లోక్ సభ సీటు, తమ కుటుంబంలోని వారికి అసెంబ్లీ సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. సరే అయితే ఇదంతా కూడా ఎందుకంటే...

పరిటాల సునీత భర్త పరిటాల రవి మరణం తర్వాత అనివార్యంగా రాజకీయాలలోకి వచ్చి తన నియోజకవర్గంలో తనకంటూ ఒక సొంత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపై తన కుమారుడు శ్రీరామ్ ను ప్రత్యక్ష రాజకీయాలలోకి తీసుకురావాలని ఉద్దేశ్యంతో ఉన్నారు. అందుకే తన స్దానంలో తన కుమారుడు శ్రీరామ్ ను పోటీచేయించాలని అనుకున్నారు. ఇందుగాను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని తనకు రెండు టిక్కెట్లు ఇవాల్సిందిగా కోరారు. ఒకటి రాప్తాడు, రెండు కళ్యాణదుర్గం. ఒక వేళ చంద్రబాబు నాయుడు రెండు టిక్కెట్లు ఖరారు చేస్తే తాను రాప్తాడు నుంచి తన కుమారుడిని కళ్యాణదుర్గం నుంచి పోటీ చేయించాలని అనుకుంటున్నానని సునీత ప్రకటించారు.

అయితే ఇలా ఎవరికి వారు టిక్కెట్లు ప్రకటించుకోవడేమిటంటూ చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసినట్లు సమాచారం.  సునీత ఇప్పటికే మంత్రిగా ఉన్నందున ఆమెనే బరిలోకి దింపాలని బాబు యోచపన‌గా చెబుతున్నారు. అయితే పరిటాల సునీత తనకు రెండు టిక్కెట్లు కేటాయించలేకపోయినప్పటికి తనకి బదులుగా తన కుమారుడికి టిక్కెట్టు ఇవాల్సిందేనని గట్టిగా పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే చంద్రబాబు మాత్రం పరిటాల శ్రీరామ్ కి టిక్కెట్టు ఇచ్చేందుకు సుముఖంగా లేరని చెబుతున్నారు. ఈ విష‌య‌మై ప‌రిటాల సునీత తీవ్ర అసంత్రుప్తితో ఉన్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.


Tags:    

Similar News