మూర్ఖులు చేసే పనులతో మిగతావారు ఇబ్బందులు పడుతుంటారు... మన చుట్టూ ఉండే ఇలాంటివాళ్లతో మనమూ ఎన్నోసార్లు ఇబ్బందులు పడే ఉంటాం. తాజాగా ఓ విమాన ప్రయాణికుడు చేసిన పనికి మిగతావారు ముక్కులు మూసుకున్నారు.
విమానంలో ఓ ప్రయాణికుడు తన తోటి ప్రయాణికుల సీటు దగ్గర మూత్రవిసర్జన చేశాడు. అమెరికాకు చెందిన జెఫ్ రూబిన్ అనే 27 ఏళ్ల కుర్రాడు ఇటీవల జెట్ బ్లూ ఫ్లయిట్-47లో ప్రయాణించాడు. విమానం గాలిలోకి ఎగరగానే నిద్రలోకి జారుకున్నాడు... విమానం దిగడానికి అరగంట ముందు అబ్బాయిగారికి మెలకువ వచ్చింది. లేవగానే మూత్ర విసర్జనకు వెళ్లాలనుకున్నాడట... అందుకు విమానంలో అన్ని సదుపాయాలు ఉన్నా, అదేం తిక్కో కానీ లేచి నిల్చుని ముందు సీట్ లో పోసేశాడు. దీంతో ముందు సీట్ లోని ప్రయాణికుల దుస్తులు, లగేజీ తడిసిపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జెఫ్ రుబిన్ ను పోలీసులు అరెస్టు చేసి ఐదుగంటలపాటు జైల్లో ఉంచారు. తాను కావాలని చేయలేదని, నిద్రలో పక్క తడిపే అలవాటు తనకుందని... ఆ అలవాటు వల్లే ఇలా తనకు తెలియకుండా చేశానని చెప్పాడు. అయితే... తప్పించుకోవడానికి అలా చెప్పాడా.. నిజంగానే ఆయనకు సమస్య ఉందా అని పోలీసులు వైద్యుల సహాయంతో విచారిస్తున్నారు.
మొత్తానికి కారణం ఏదైనా విమానం మాత్రం గబ్బుగబ్బయింది ఈ గబ్బర్ సింగ్ దెబ్బకు.