ఏపీ సీఎం వైఎస్ జగన్ పై బూతు వ్యాఖ్యలు చేసిన పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో మొదట మచిలీపట్నం జైలుకు తరలించారు. అనంతరం శుక్రవారం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
ఈనెల 21న పట్టాభిని పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. దీంతో నవంబర్ 2 వరకూ పట్టాభికి కోర్టు రిమాండ్ విధించింది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని నిన్న సాయంత్రం మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. రాత్రిపూట అక్కడే ఉంచారు. ఇవాళ ఉదయం భారీ బందోబస్తు మధ్య పట్టాభిని మచిలీపట్నం సబ్ జైలు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
విజయవాడ కోర్టులో పట్టాభి నిన్నే బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరుగనుంది. బుధవారం పట్టాభి అరెస్ట్ అనంతరం ఆయన తరుఫు న్యాయవాదులు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. పోలీసులు కోర్టులో హాజరుపరుచగా బెయిల్ పై వాదనలు కొనసాగాయి. పట్టాభి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తికి వివరణ ఇచ్చారు. ఇప్పటికే తన ఇంటిపై పలుమార్లు దాడి చేశారని పేర్కొన్నారు.
తాను సీఎంను కానీ.. ప్రభుత్వంలో ఉన్న వారిని కానీ వ్యక్తిగతంగా విమర్శించలేదని కోర్టులో జడ్జికి పట్టాభి వివరించారు. ఇప్పటికే తన ఇంటిపై పలుమార్లు దాడి చేశారని జడ్జికి వివరించారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ పట్టాభి న్యాయమూర్తికి తెలిపారు.
తాను విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడలేదని.. తన ప్రెస్ మీట్ వీడియో క్లిప్పింగ్ పరిశీలించాలంటూ పట్టాభి న్యాయమూర్తిని వేడుకున్నారు. తనకు నోటీస్ ఇవ్వకుండానే రాత్రి 9.30 గంటల సమయంలో అరెస్ట్ చేశారని తెలిపారు. కాన్ఫెషన్ స్టేట్ మెంట్ లో మధ్యవర్తులు లేకుండానే తనతో పోలీసులు బలవంతంగా సంతకం చేయించారని న్యాయమూర్తికి పట్టాభి వివరించారు.
ఈక్రమంలోనే కోర్టు బెయిల్ నిరాకరించడంతో పట్టాభిని మచిలీపట్నం జిల్లా జైలుకు తరలించారు. ఈరోజు ఇక్కడి నుంచి రాజమండ్రికి తరలించారు. సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పట్టాభిపై పోలీసులు సెక్షన్ 153(ఏ), 505(2), 353,504 రెడ్ విత్ 120 (బి) కింద కేసులు నమోదు చేశారు.