బాబుతో ప‌వ‌న్‌!... ఈ సారేం మాట్లాడుకున్నారో?

Update: 2019-05-01 14:30 GMT
టీడీపీ అధినేత‌ - ఏపీ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు - జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ లు మొన్న‌టి ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థుల మాదిరిగా క‌ల‌రింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. 2014 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ను మేనేజ్ చేసుకుని ఆయ‌న‌తో ప్ర‌చారం చేయించుకున్న చంద్ర‌బాబు ఎలాగోలా గెలిచేశార‌న్న వాదన లేక‌పోలేదు. అయితే ఏమైందో తెలియ‌దు గానీ... టీడీపీకి ప‌వ‌న్ దూరంగా జ‌రిగారు. చంద్ర‌బాబు - లోకేశ్ ల మీద ఘాటు వ్యాఖ్య‌లు చేసిన ఆయ‌న పెను క‌ల‌క‌ల‌మే రేపారు. అయితే స‌రిగ్గా ఎన్నిక‌ల ప్ర‌చారం హీటెక్కిన స‌మ‌యంలో వీరి మ‌ధ్య కొన‌సొగుతున్న ర‌హ‌స్య మైత్రి ఎలాంటిదో తెలిసిపోయింది. అధికార పార్టీని దునుమాడాల్సిన ప‌వ‌న్‌... విప‌క్ష నేత - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపైనా అన‌వ‌స‌రంగా విరుచుకుప‌డ‌టం - చంద్ర‌బాబు కూడా వ‌ప‌న్ ను ఒక్క మాటా అన‌క‌పోవ‌డంతో వీరి మ‌ధ్య దోస్తానా గుట్టుగానే సాగుతోంద‌న్న వాద‌న బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఎన్నిక‌లు ముగియ‌గానే.... హైద‌రాబాద్ లో జ‌రిగిన ఓ రిచ్ సెలబ్రిటీ వెడ్డింగ్ లో క‌లిసి వీరిద్ద‌రూ క‌ర‌చాల‌నాలు - ఆలింగ‌నాలు చేసుకున్నారు. అంతేకాదండోయ్‌... కాసేపు ఎదురెదురుగా నిల‌బ‌డి మాట్లాడుకున్నారు. ఆ త‌ర్వాత ఎవ‌రి దారిన వారు వెళ్లినా... మీడియా కంట‌బ‌డ‌కుండా వారిద్ద‌రూ భేటీ అవుతూనే ఉన్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు విజ‌య‌వాడ‌లో ఓ దైవ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన సందర్భంగా వీరిద్ద‌రూ ర‌హ‌స్యంగా భేటీ అయ్యార‌న్న వార్త‌లు ఇప్పుడు ఆస‌క్తి రేపుతున్నాయి. ఆ భేటీ వివ‌రాల్లోకి వెళితే... బెజ‌వాడ స‌మీపంలోని ద‌శావ‌తార వెంక‌టేశ్వ‌ర ఆల‌యం ఉంది కదా. ఈ ఆల‌యం ప్ర‌తిష్ఠాప‌న కార్య‌క్ర‌మంలోనూ బాబు, ప‌వ‌న్ క‌లిసిన విష‌యం గుర్తుంది క‌దా. ఇప్పుడు కూడా వీరిద్ద‌రూ ఈ ఆల‌యంలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. మైసూర్ ద‌త్త‌పీఠాధిప‌తి గ‌ణ‌ప‌తి స‌చ్చిదానంద ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న ఈ ఆల‌యంలో ఇటీవ‌ల ఓ కార్య‌క్రమం జ‌ర‌గ‌గా.. దానికి చంద్ర‌బాబుతో పాటు ప‌వ‌న్ కూడా హాజ‌ర‌య్యార‌ట‌. స‌చ్చిదానంద ఆహ్వానం మేర‌కే ఈ ఇద్ద‌రూ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన‌ట్లుగా తెలుస్తోంది.

అంతేకాదండోయ్‌... ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన బాబు, ప‌వ‌న్ ఏకాంతంగా చ‌ర్చ‌లు కూడా జ‌రిపార‌ట‌. దాదాపు గంట‌కు పైగానే సాగిన వీరి భేటీలో ఏఏ అంశాలు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చాయ‌న్న విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే... ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల పోలింగ్ స‌రిళిపై వీరు చ‌ర్చించుకున్నార‌ట‌. అంతేకాకుండా జాతీయ రాజ‌కీయాలు, ఈ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కేంద్రంలో ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌న్న విష‌యాల‌పైనా వీరు చ‌ర్చించుకున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. వీరిద్ద‌రి ఏకాంత భేటీని స‌చ్చిదానంద‌నే ఏర్పాటు చేసిన‌ట్లుగా కూడా కొన్ని వ‌ర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా బ‌య‌ట క‌త్తులు దూసుకున్నా... చాటుమాటుగా ఒకరి బాగోగులు మ‌రొక‌రు బాగానే ప‌ట్టించుకుంటున్నార‌న్న‌మాట‌. అయినా ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతున్న వేళ‌... వీరిద్ద‌రి భేటీ కేవ‌లం సాధార‌ణ అంశాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయి ఉండ‌ద‌ని, ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత ప‌రిస్థితి ఏమిట‌న్న విష‌యంపైనే వీరు చ‌ర్చించుకున్న‌ట్లుగా అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.


Tags:    

Similar News