ఎలాన్ మస్క్ కు ట్రంప్ ఇచ్చింది మామూలు 'విద్యుత్తు షాక్' కాదు..
పెట్రోల్, డీజిల్ ధరలు భరించలేక , పర్యావరణాన్నీ పరిగణనలోకి తీసుకుని ప్రపంచం ఇప్పుడు విద్యుత్తు వాహనాల వైపు చూస్తోంది. దీంతో ఎలాన్ మస్క్ వంటి వారి పంట పడుతోంది.
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన గంటల్లోనే డొనాల్డ్ ట్రంప్ తన సత్తా ఏమిటో చూపుతున్నారు. వరుస పెట్టి ఆర్డర్లు ఇచ్చేస్తూ సంచలనం రేపుతున్నారు.. ఒకదాని వెనుక ఒకటిగా వస్తున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో ప్రపంచమే నివ్వెరపోతోంది. వాస్తవానికి ట్రంప్ అధ్యక్షుడు అయిన వెంటనే వంద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఇస్తారని భావించారు. ఇది అసాధారణం అని కూడా చెప్పుకొచ్చారు. కానీ, వాస్తవ రూపం దాల్చుతుందా? లేదా? అనేదే సందేహంగా మారింది. చివరకు అనుకున్నదే జరుగుతోంది.
ఆయనకు ఈయన.. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికవడంలో అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పాత్ర చాలా ఉంది. తన వ్యాపార ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉన్నప్పటికీ ట్రంప్ ను ఏమాత్రం సంకోచం లేకుండా మస్క్ సమర్థించారు. నేరుగా ప్రచారంలో పాల్గొని ట్రంప్ తో కలిసి డ్యాన్స్ కూడా చేశారు. ట్రంప్ సైతం ప్రవాస భారతీయుడు వివేక్ రామస్వామితో కలిపి అమెరికా వ్యవస్థ సగ్రమ ప్రక్షాళన (డోజ్) బాధ్యతలను ట్రంప్ నకు అప్పగించారు. ఇవన్నీ చూసి ట్రంప్ అధ్యక్షుడుతే ఆక్ష్న కార్యవర్గంలో మస్క్ కు అత్యంత ప్రాధాన్యం దక్కుతుందని భావించారు.
ఆ ఒక్క దెబ్బతో..
పెట్రోల్, డీజిల్ ధరలు భరించలేక , పర్యావరణాన్నీ పరిగణనలోకి తీసుకుని ప్రపంచం ఇప్పుడు విద్యుత్తు వాహనాల వైపు చూస్తోంది. దీంతో ఎలాన్ మస్క్ వంటి వారి పంట పడుతోంది. ఈ రంగంలో మస్క్ ది తిరుగులేని స్థాయి. కానీ, ట్రంప్ తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేమంటే.. 2030 నుంచి విక్రయించే కొత్త కార్లలో కనీసం 50శాతం విద్యుత్తు వాహనాలు ఉండాలంటూ మాజీ అధ్యక్షుడు బైడెన్ తీసుకొన్న నిర్ణయాన్ని తొలగించడం. ఇలా విద్యుత్తు వాహనాలపై ట్రంప్ నిర్ణయం ఎలక్ర్టికల్ కార్ల కంపెనీ టెస్లా యజమాని మస్క్ కు షాక్ అనడంలో సందేహం లేదు.
కాగా, బైడెన్ హయంలోని 78 ఆదేశాలను ట్రంప్ వెనక్కు తీసుకున్నారు. అంతేగాక ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి వైదొలగడం, ప్రత్యర్థులపై ప్రభుత్వాన్ని ఆయుధంలా వాడడం, వాక్ స్వేచ్ఛకు రక్షణ, వన వ్యయాల సంక్షోభంపై దృష్టిపెట్టేలా అన్ని ఏజెన్సీలకు మార్గదర్శకాలు, ప్రభుత్వ ఉద్యోగులు కచ్చితంగా కార్యాలయాలకు వచ్చి విధుల్లో హాజరుకావాలన్న ఆదేశాలిచ్చారు.
కెనడా, మెక్సికోలపై ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 25శాతం అదనపు సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ అల్టిమేటం ఇచ్చారు.కొవిడ్ వ్యాప్తి సమయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలగింది.కృత్రిమ మేధ విస్తరణను నియంత్రిస్తూ బైడెన్ ఇచ్చిన ఆదేశాలను ట్రంప్ తొలగించారు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో కొన్నాళ్లుగా సరిహద్దు గోడ సామగ్రిని వేలంలో విక్రయిస్తున్నారు.
ఈ ఆదేశాలను ట్రంప్ వెనక్కు తీసుకున్నారు.చైనా కంపెనీ టిక్ టాక్ అమెరికా వింగ్ ను అమ్మేందుకు ట్రంప్ సర్కారు 75 రోజుల సమయం ఇచ్చింది. అమెరికాకు ఆ యాప్‌లో 50 శాతం వాటా ఉండాలని ట్రంప్ ఈసందర్భంగా వ్యాఖ్యానించారు. వాస్తవానికి టిక్‌టాక్ పేరెంట్ కంపెనీకి దీనిని అమ్మేందుకు జనవరి 19 వరకు గడువు ఇచ్చారు.