డైరెక్టుగా ఎన్నికల్లో పోటీ పడకున్నా.. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర అంత తక్కువేమీ కాదు. తెలుగుదేశం - భారతీయ జనతా పార్టీలకు మద్దతుగా ఆయన చేసిన ప్రచారం వారికి ఎంతగానో ఉపయోగపడిందన్నది ఆయా పార్టీలు కూడా కాదనలేని సత్యం. ఐతే అలాంటి సాయం మరోసారి చేయాలని జీహెచ్ ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ను తెదేపా - భాజపా పార్టీలు అడిగినా ఆయన స్పందించలేదు. మరీ ఒత్తిడి చేస్తే బాగోదని భావించి పవన్ ను వదిలేశాయి ఆ పార్టీలు.
ఐతే ఇప్పుడు మరికొన్ని పార్టీలు కలిసి పవన్ ను సంప్రదించినట్లు సమాచారం. లోక్ సత్తా - సీపీఐ - సీపీఎం - మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ - ఆమ్ ఆద్మీ - మోస్ట్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఎంబీసీ-జేఏసీ).. ఇవన్నీ ఉమ్మడిగా ‘వన్ హైదరాబాద్ ఫర్ క్లీన్ పాలిటిక్స్’ పేరుతో ఓ కూటమి ఏర్పాటు చేసి.. దానికి పవన్ ను నాయకత్వం వహించాలని కోరాయట.
జయప్రకాష్ నారాయణ సహా ఆయా పార్టీల పెద్దలు కొందరు వెళ్లి పవన్ ను కలిసి తమ ప్రతిపాదనను వివరించారట. అవినీతిపై పోరాడే ఉద్దేశంతో ఈ కూటమి ఏర్పాటైందని.. నిజాయితీ పరుడిగా గుర్తింపు ఉన్న మీరు నాయకత్వం వహిస్తే బాగుంటుందని అడిగారట. ఐతే ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఈ బాధ్యత చేపట్టలేనని సున్నితంగా తిరస్కరించాడట పవన్. దీంతో కూటమి పెద్దలు నిరాశగా వెనుదిరిగినట్లు తెలిసింది. మరోవైపు పవన్ ను కనీసం తమ పార్టీ ‘లోక్ సత్తా’కు మద్దతుగా అయినా ప్రచారం చేయించాలని జేపీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.