యూటర్న్ లో చంద్రబాబును ఫాలో అవుతున్న పవన్!

Update: 2019-11-27 05:11 GMT
ఇంగ్లిష్ మీడియం చదువుల విషయంలో చంద్రబాబు నాయుడు ఇప్పటికే యూటర్న్ తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను చంద్రబాబు నాయుడు మొదట వ్యతిరేకించారు. అయితే గవర్నమెంట్ స్కూళ్లకు పిల్లలను పంపే ఆర్థికంగా వెనుకబడ్డ, దళిత, బీసీ వర్గాల ప్రజలు ఈ విషయంలో ఆసక్తితో ఉన్నారు. తమ పిల్లలు ఇంగ్లిష్ మీడియంలలో చదివి, బాగు పడాలనే కోరిక వారిలో ఉంది.

తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించే వాళ్లే ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకిస్తున్నారనేది బహిరంగ సత్యం. దీంతో తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో అలర్ట్ అయ్యింది. ఇక ఇంగ్లిష్ మీడియం గురించి ఎవరూ మాట్లాడకూడదని చంద్రబాబు నాయుడు తన పార్టీ వాళ్లను ఆదేశించారు. అంతే కాకుండా.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం తమ వల్లనే అంటూ ప్రచారం చేయాలని కూడా ఆయన తన పార్టీ వాళ్లను ఇప్పటికే  ఆదేశించారు.

కాస్త లేటుగా అయినా పవన్ కల్యాణ్ కూడా అలాంటి యూటర్నే తీసుకున్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 'ఇంగ్లిష్ వద్దనడం లేదు.. మాతృభాషను వదలవద్దని అంటున్నాం..' అంటూ పవన్ చెప్పుకొచ్చారు. ఈ యూటర్న్ ను సమర్థించుకోవడానికి జగన్ మీద ఇష్టానుసారం ట్వీట్ చేశారు పవన్ కల్యాణ్.

జగన్ ది ఫ్యాక్షనిస్టు మనస్తత్వం అన్నట్టుగా పవన్ చెప్పుకొచ్చారు. అయినా తెలుగుకూ, ఫ్యాక్షనిజానికి ఏం సంబంధమో పవన్ కే తెలియాలి. అంతే కాదట..'తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని మీలాంటి వాళ్లనుంచి ఎలా రక్షించుకోవాలో మాకు తెలుసు..' అంటూ జగన్ ను ఉద్దేశించి ఒక అర్థం లేని ట్వీటే పెట్టాడు పీకే. అయినా తెలుగు సంస్కృతి, తెలుగు భాష అంత ప్రమాదకరమైన స్థితిలో ఉందని ఈ సినీ నటుడు అనుకుంటున్నాడా!
Tags:    

Similar News