పవన్ ఎవరి ఓట్లను చీల్చనున్నాడో అర్థమైపోయిందిగా..

Update: 2019-02-21 02:30 GMT
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..?

బాహుబలి సెకండ్ పార్ట్ సినిమా రావడానికి ముందు వరకు ఈ ప్రశ్న యావద్భారత దేశాన్ని తొలిచివేసింది. ఎవరెన్ని రకాలుగా ఆలోచించినా - ఊహించినా కూడా సెకండ్ పార్ట్ వచ్చేవరకు ఆ కారణాన్ని తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా కొంతకాలంగా ఇలాంటి ప్రశ్నే ఒకటి అందరి మెదళ్లను తొలిచేస్తోంది. ఆ ప్రశ్న ఏమిటంటే.. పవన్ కళ్యాణ్ వల్ల ఎవరి ఓట్లు చీలుతాయి? టీడీపీదా? వైసీపీదా?.. దీనికి ఎవరికి వారు తమకి తోచినట్లు చెప్పుకొంటున్నారు. నిజానికి - ఎన్నికలలు జరిగి ఫలితాలు వస్తేకానీ ఏమీ చెప్పలేని పరిస్థితి. కానీ.. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం ఈ ప్రశ్నకు ముందే సమాధానం తెలిసిసోతోంది. పవన్ కల్యాణ్ వల్ల టీడీపీ ఓట్లీ చీలుతాయని స్పష్టంగా తెలుస్తోంది.
  
ఈ ప్రశ్నకు సమాధానం తెలిసిపోయింది అని పక్కాగా చెప్పడానికి ముందు కొన్ని విషయాలు విశ్లేషించుకోవాలి.

పవన్ కల్యాణ్ సామాజిక వర్గమేంటి?..

కాపు సామాజికవర్గం

ఇటీవల వైసీపీలో చేరిన టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ సామాజికవర్గం?

కాపు..

ఆయన కంటే ముందు చేరిన ఆమంచి కృష్ణమోహన్ సామాజికవర్గం?

కాపు

ఇప్పుడు వైసీపీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న తోట త్రిమూర్తులు ఏ సామాజికవర్గం?

కాపు..

సో... ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది. జనసేన - పవన్ కల్యాణ్ కారణంగా టీడీపీ ఓట్లు చీలిపోబోతున్నాయి. అందుకే.. ఈ టీడీపీ నేతలంతా ఆ ఓట్ల చీలికకు దొరక్కుండా వైసీపీలో చేరాలని అనుకుంటున్నారు.

ఉత్తరాంధ్ర నుంచి ఒంగోలు వరకు టీడీపీలోని కాపు నేతలు ఒకే తీరుగా ఆలోచించి వైసీపీలోకి వెల్తున్నారంటే అదేమీ ఉత్తనే జరగదు కదా. పవన్ కల్యాణ్ ఈ ప్రాంతంలోని కాపు ఓట్లను చీలుస్తారన్నది కచ్చితం.. ఆ ప్రభావం టీడీపీపైనే పడనుందని అర్థమవుతోంది. అందుకే ఈ టీడీపీ ఎమ్మెల్యేలు - ఎంపీలు అంతా వైసీపీలోకి వెళ్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.



Tags:    

Similar News