ఇటీవల వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు మీద అగ్గి పైర్ అవుతున్నారు పవన్ కల్యాణ్ ఫాలోవర్స్. పవన్ ఎవరో తనకు తెలీదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతలు సైతం తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. అశోక్ గజపతిరాజు తీరుపై తీవ్రంగా మండిపడుతున్న వారు.. తిట్ల దండకం అందుకుంటున్నారు. పవన్ తెలీదని అంటారా? ఇంతకు మించిన సిగ్గుచేటు విషయం ఏం ఉంటుందన్న వారు.. అశోక్ గజపతిరాజు తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు.
2014 ఎన్నికల్లో ఎంపీగా గెలిచేందుకు కేవలం పవన్ కల్యాణ్ ప్రచారమే కారణమని.. అంతకు ముందు ఎన్నికల్లో ప్రజలు ఆయన్ను చిత్తుగా ఓడించిన సంగతిని మర్చిపోయారా? అంటూ ఫైర్ అయ్యారు. తమ అధినేత అడుగుజాడల్లోనే నడుస్తున్న జనసేన.. ప్రెస్ మీట్ పెట్టకుండా.. ప్రెస్ నోట్ ద్వారానే తన తిట్ల దండకాన్ని అందుకున్నారు. పార్టీ నాయకుడు పోతిన వెంక మహేశ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేస్తూ.. కేంద్రమంత్రి తీరును దుయ్యబట్టారు.
రాచరికపు అహంభావం అశోక్ గజపతిలో ఇంకా తగ్గినట్లుగా లేదన్న ఆయన.. పవన్ కల్యాన్ పై ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే కేంద్రమంత్రికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వార్నింగ్ ఇవ్వటం గమనార్హం. ఎంత పవన్ తెలీదని వ్యంగ్యంగా అంటే మాత్రం.. మరీ అంతగా ఫైర్ అయిపోవాలా? రాజకీయాల్లో పొగడ్తలు.. తెగడ్తలు కామనే. కానీ చిన్న వ్యంగ్యానికే అంతలా రియాక్ట్ అయ్యే బదులు కేంద్రమంత్రిగా అశోక్ గజపతి రాజు వైఫల్యాల్ని ఎత్తి చూపిస్తే బాగుంటుంది కదా?