కేసీఆర్‌ తో ఫ్రెండ్షిప్.. త‌ప్పేముంది? - ప‌వ‌న్‌

Update: 2018-03-07 10:15 GMT
ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు మెల్ల‌గా రాజ‌కీయాలు అల‌వాటైనట్టున్నాయి. కొన్ని విష‌యాల్లో ఆయ‌న స్పంద‌న చూస్తుంటే ఈ మాట ఎవ‌రైనా నిజ‌మే అంటారు. తాజాగా ఆయ‌న స్పందించారు. కేసీఆర్‌ కు మ‌ద్ద‌తు ప‌లికినా - కేసీఆర్‌ తో మాట్లాడినా - ఆయ‌న‌ను క‌లిసినా కొంద‌రు చాలా చిత్రంగా విమ‌ర్శిస్తున్నార‌ని అంటూ... కేంద్ర ప్ర‌భుత్వంతో స‌న్నిహితంగా ఉన్న‌పుడు రాని అనుమానాలు ఇపుడెందుకు వ‌స్తాయ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అప్పుడు త‌ప్పు కానిది ఇపుడు త‌ప్పు అవుతుందా? అని అడిగారు. నాకు తెలిసినంత వ‌ర‌కు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ తో స‌న్నిహితంగా ఉండ‌టంలో తప్పు ఏం క‌నిపించిందో అర్థం కావ‌డం లేద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్యానించారు.

ఈ సంద‌ర్భంగా జ‌న‌సేనాధినేత మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న కూడా చేశారు. అస‌లు ఆయ‌నది పొత్తు రాజ‌కీయ‌మా? స‌్వ‌తంత్ర రాజ‌కీయ‌మా అనేది కూడా త్వ‌ర‌లో తేలుస్తార‌ట‌. ఈనెల 14వ తేదీ జ‌రగ‌నున్న స‌భ‌లో ఏపీ - తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్ని సీట్ల‌లో పోటీ చేయ‌నున్న‌ది వెల్ల‌డిస్తార‌ట‌. అదే స‌మావేశంలో భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ కూడా ప్ర‌క‌టిస్తామ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు.

మ‌రో సారి సినిమాల‌పై స్పందించిన ఆయ‌న సినిమాలో న‌టించ‌డం నాకు ఇష్టమే కాని దానికి టైం లేద‌ని చెప్పారు. మొత్తానికి ప‌వ‌న్ కి సినిమాల‌పై మోజు ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని తెలుస్తోంది. మ‌రోవైపు కేసీఆర్‌ కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంత వేగంగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డంపై కూడా ప‌లువురు ప‌వ‌న్ స‌మ‌ర్థ‌త‌పై అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఎపుడూ కూడా ఎన్నిక‌ల్లో స్వ‌తంత్రంగా పోటీ చేసే విష‌యంలో కాన్ఫిడెంటుగా లేర‌ని అంటున్నారు. కేసీఆర్‌ కు అంత వెంట‌నే మ‌ద్ద‌తు ప్రక‌టించి తోక పార్టీగా మిగిలిపోతాడా అని కొంద‌రు సెటైర్లు వేస్తున్నారు.
Tags:    

Similar News