ప‌వ‌న్ చెప్పిన అద్భుత గాసిప్ ఇది!

Update: 2019-01-12 07:42 GMT
రంగాలు ఎన్ని ఉన్నా సినిమా రంగానికి ఉండే షోకు వేరు. అర‌చేతిలో ప‌వ‌ర్ పెట్టుకున్న రాజ‌కీయ నేత‌లు సైతం సినిమా స్టార్స్ కు ఉండే ఇమేజ్ ను చూసి త‌ర‌చూ అసూయ‌ప‌డిపోతుంటారు. బ‌య‌ట‌కు పెద్ద‌గా రాకుండా.. ఏడాదికి చేసే ఒక‌ట్రెండు సినిమాల‌తో వారు సంపాదించుకునే ప్ర‌జాక‌ర్ష‌ణకు ఫ్లాట్ అయిపోతుంటారు.

మొన‌గాడు లాంటి నాయ‌కుడు సైతం సినిమా వాళ్ల ముందు త‌గ్గిన‌ట్లుగా క‌నిపిస్తారు. మ‌న‌సులో ఎలా ఉన్నా పైకి మాత్రం సినిమా వాళ్ల‌తో వారు చ‌క్క‌టి రిలేష‌న్స్ ను మొయింటైన్ చేస్తుంటారు. ఇక‌.. సినిమా నేప‌థ్యంతో వ‌చ్చిన గ్లామ‌ర్ తో రాజ‌కీయంగా ఎదగాల‌ని త‌పించే వారేం త‌క్కువేం కాదు. అప్ప‌టి ఎన్టీఆర్ తో మొద‌లెడితే.. ఇప్ప‌టి ప‌వ‌న్ వ‌ర‌కూ రాజ‌కీయంగా త‌మ స‌త్తా ఏమిటో చాటాల‌ని త‌పిస్తుంటారు. అయితే.. ప‌వ‌న్ లాంటోళ్ల‌కు ఎన్టీఆరే స్ఫూర్తి.

తొమ్మిది నెల‌ల వ్య‌వ‌ధిలోనే ముఖ్య‌మంత్రి కుర్చీని సొంతం చేసుకున్న‌ట్లుగా.. త‌మ‌కూ అవ‌కాశం ఉంద‌ని భావించే త‌త్త్వం ఎక్కువే ఉంటుంది. మిగిలిన వారి కంటే తాను భిన్న‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే ప‌వ‌న్ క‌ల్యాణ్.. త‌న‌కు సీఎం కుర్చీ మీద ఆశ‌లేద‌ని.. ఆ మాట‌కు వ‌స్తే అర్జెంట్ గా ముఖ్య‌మంత్రిని అయిపోవాల‌న్న ఆరాటం త‌న‌కు లేద‌ని.. ఆ సీట్లో కూర్చునే అనుభ‌వం ముందు సంపాదించాలంటూ బోలెడ‌న్ని మాట‌లు చెప్ప‌టం అంద‌రూ విన్న‌దే.

తాను చెప్పే మాట‌ల్ని జ‌నం విని..వాటిని గుర్తు పెట్టుకుంటార‌న్న ఆలోచ‌న లేకుండానే.. రానున్న ఏపీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి సీఎం అయిపోవాల‌న్న ఆరాటం  కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. తాను మాట్లాడే ప్ర‌తి మాట‌కు ఎంతో మ‌ధ‌నం జ‌రిగిన త‌ర్వాతే త‌న నోటి నుంచి వ‌స్తుంద‌ని ప‌వ‌న్ చెప్పే మాట‌కు.. తాజాగా ఆయ‌న పార్టీ నేత‌ల వ‌ద్ద చేసిన వ్యాఖ్య‌ల‌కు మ‌ధ్య వ‌త్యాసం చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.

సినిమా అన్నంత‌నే గాసిప్పులు ట‌న్నుల లెక్క‌న వినిపిస్తూ ఉంటాయి. వాటి మీద కారాలు.. మిరియాలు నూర‌టం సినీ ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల‌కు అల‌వాటే. కానీ.. ఒక ప్ర‌ముఖ సినీ న‌టుడు క‌మ్ రాజ‌కీయ నేత తానే స్వ‌యంగా గాసిప్ మాట‌ను చెప్ప‌టం ఆస‌క్తిక‌ర అంశంగా చెప్పాలి.  తాజాగా ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల్ని చూస్తే.. ఎలాంటి ఆధారాలు చూపించ‌క‌నే  ఇలా మాట్లాడేయ‌టం ప‌ద్ద‌తేనా? అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. ఇంత‌కీ ప‌వ‌న్ చేసిన‌వ్యాఖ్య‌లు చూస్తే.. జ‌న‌సేన‌తో పొత్తు కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంద‌ని.. అందుకు టీఆర్ ఎస్ నేత‌ల‌తో రాయ‌బారాన్ని పంపార‌న్న వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు చెబుతున్నారు.

ఓప‌క్క జ‌న‌సేన‌కు బ‌లం లేదంటూనే.. ఇలా రాయ‌బారాలు పంప‌టం ఏమిటంటూ కృష్ణా జిల్లా నేత‌ల‌తో ప‌వ‌న్ అన్న‌ట్లు చెబుతున్నారు. ప‌వ‌న్ మాట‌లే నిజ‌మ‌ని అనుకుందాం. మ‌రి.. రాయ‌బారాన్ని తీసుకొచ్చిన పెద్ద మ‌నిషి ఎవ‌రు?  వారి వివ‌రాలు ఏమిటో చెబితే స‌రిపోతుంది క‌దా?  అన్న‌ట్లు విభ‌జ‌న గాయంతో తాను చాలా రోజులు మ‌నిషిని కాలేక‌పోయిన‌ట్లు చెప్పే ప‌వ‌న్.. అందుకు కార‌ణ‌మైన టీఆర్ఎస్ నేత‌ల‌తో అంత ద‌గ్గ‌ర సంబంధాలు ఏమిటి?

ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు టీఆర్ ఎస్ నేత‌లు రాయ‌బారాన్ని తీసుకొచ్చేంత క్లోజ్ అయితే.. ఆ లెక్క‌ల గురించి చెబితే బాగుంటుంది? ఎదుటోడి మీద బుర‌ద వేయ‌టంలోనూ కాస్త తెలివిని ప్ర‌ద‌ర్శించాల‌న్న ఆలోచ‌న ప‌వ‌న్ కు లేక‌పోవ‌టం బాధించే విష‌య‌మే. ప‌వ‌న్ పొత్తు కోసం ఆరాటం జ‌గ‌న్ కు ఉండాల్సిన అవ‌స‌రం ఏమిటి?  ఎలాంటి పొత్తుల్లేకుండానే 2014లో పోరాడిన ప్ర‌తిప‌క్ష నేత‌కు ఇప్పుడు అవ‌స‌రం ఏముంది?  మోడీ.. బాబు.. ప‌వ‌న్ ల‌తో కూడిన కూట‌మితోనే పోరాడిన జ‌గ‌న్ కు ఆ ముగ్గురు మూడు దారులుగా మారిన వేళ‌లో ప‌వ‌న్ తో పొత్తు కోసం జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు చేయాల్సిన అవ‌స‌ర‌మే లేదు.


Full View

Tags:    

Similar News