పవన్ నామినేషన్ లో ‘నాట్ అప్లికేబుల్’

Update: 2019-03-23 07:57 GMT
ఎమ్మెల్యేగా కానీ.. ఎంపీగానీ నామినేషన్ వేసే అభ్యర్థులు దరఖాస్తు ఫారంలో అన్ని కాలమ్ లు నింపాల్సి ఉంటుంది.  ఏ ఒక్క కాలం ఏ కారణం చేత అయినా నింపకపోయినా.. వివరాలు తెలుపకపోయినా ఆ నామినేషన్ అనర్హతకు గురవుతుంది. పోటీచేసే అవకాశాన్నే దూరం చేస్తుంది.

కానీ ఇంత తెలిసి ఉన్నా కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ తన నామినేషన్ లో కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. ఒకరకంగా ఆదర్శంగా ఉండే ప్రయత్నం చేశారు. ఎన్నికల సంఘం పరిశీలనలో ఉన్న ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేది ఉత్కంఠగా మారింది.

జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండు స్థానాల నుంచి పోటీచేస్తూ నామినేషన్లు దాఖలు చేశారు. ప్రస్తుత నామినేషన్ లో అభ్యర్థి వ్యక్తిగత అంశాల కాలంలో ఏ కులమో ఖచ్చితంగా నింపాల్సి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఏ కులమో నింపకుండా ‘నాట్ అప్లికేబుల్’ అని రాశారు. తాను ఏ కులానికి చెందిన వాడిని కాదని చెప్పేందుకు పవన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు పవన్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయాల్లో ఆసక్తికరంగానూ ఆదర్శంగానూ మారింది.

ఇక పవన్ కళ్యాణ్ బాటలోనే జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా నడిచాడు.  ఆయన సైతం తన నామినేసన్ లో కుల ప్రస్తావన వద్ద ‘నాట్ అప్లికేబుల్’ అని రాయడం విశేషం.

ఇలా పవన్ తో సాన్నిహిత్యంగా ఉండే చాలా మంది జనసేన అభ్యర్థులు ఇదేరకంగా తమ నామినేషన్ల దాఖలు సమయంలో వ్యవహరించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. తాము చెబుతుంది ఆచరణలో చూపించాలనే ఉద్దేశంతోనే  నామినేషన్ల నుంచే తమ విధానం ఇదీ అని స్పష్టం చేస్తున్నామని పవన్ కళ్యాన్ తన చేతల ద్వారా నిరూపించడం విశేషం.
Tags:    

Similar News