పవన్ కీలక హామీ.. మా ప్రభుత్వంలో పాత ధరలకే మద్యం

Update: 2023-07-01 09:44 GMT
వారాహి విజయ యాత్ర పేరు తో చేపట్టిన పర్యటన తాజాగా భీమవరం చేరటం.. అక్కడ నిర్వహించిన రోడ్ షో సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారీగా హాజరైన సభ లో గంట కు కాస్త ఎక్కువగా ప్రసంగించిన ఆయన.. సంచలన హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారం లోకి వస్తే.. తప్పనిసరిగా మద్యం ధరల్ని తగ్గిస్తామన్నారు. గతం లో ఎవైతే పాత రేట్లు ఉంటాయో.. అవే ధరల్ని అమలు చేస్తామన్నారు. మద్య నిషేధం చేస్తామన్న మాటలు తాను చెప్పనన్న ఆయన.. మద్య నిషేధాన్ని విధించే ఆలోచన లేదన్నారు.

కాకుంటే.. నాణ్యమైన మద్యాన్ని పాత ధరల తో అమ్ముతామని ప్రకటించారు పవన్ కల్యాణ్. గతంతో రూ.70-80 మధ్య ఉన్న ధరల్ని ఒక్కసారిగా రూ.200-250 కు పెంచారన్నారు. రోజువారీ కూలీ లో సగానికి పైగా మద్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. భారీగా ధరల్ని పెంచేసిన జగన్ ప్రభుత్వం.. కనీసం నాణ్యమైన మద్యాన్ని కూడా అమ్మటం లేదన్నారు. ఏపీ ప్రభుత్వం అమ్ముతున్న కల్తీ మద్యం అత్యంత హానికరమన్నారు. లివర్.. కిడ్నీ.. బ్రాంకైటీస్ లాంటి వ్యాధుల కు మూలం ప్రభుత్వం అమ్ముతున్న తక్కువ రకం మద్యమేనని చెప్పారు.

తాము మొదట్నించి చెబుతున్నట్లుగా సంపూర్ణ మద్యపాన నిషేధం సాధ్యం కాదన్న పవన్.. ఒకవేళ ఎక్కడైనా తమ ఆడబడుచులు తాము ఉంటున్నకాలనీల్లో మద్య నిషేధం వద్దని బలంగా చెబితే.. అక్కడ ఎలాంటి మద్యం అమ్మకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఒకవైపు మద్యం అమ్మకాలు చేపడతామని చెబుతూనే.. కొన్నికాలనీల్లో.. వీధుల్లో మాత్రం షాపులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పటం గమనార్హం.

Similar News