రోడ్లపైకి నేనే వస్తా, ఆ పరిస్థితి తీసుకురావొద్దు.. పవన్ కళ్యాణ్ వార్నింగ్!
ఏపీలో దారుణంగా తయారైన రోడ్ల పరిస్థితిపై జనసేన పార్టీ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. గుంతలు పడిన, ప్రయాణించడానికి వీలు కాని దుస్థితిలో ఉన్న రోడ్లను వీడియోలు, ఫోటోలు తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ జనసేన పార్టీ వినూత్న నిరసనలకు దిగింది. రోడ్లను మరమ్మతులు చేయాలని జగన్ సర్కార్ మీద ఒత్తిడి తెస్తోంది. ఒకవేళ సర్కార్ రోడ్ల మరమ్మత్తు చేయకుంటే గాంధీ జయంతి రోజున తామే శ్రమదానం చేసి రోడ్లు బాగు చేయడానికి రంగంలోకి దిగుతామని జనసేన హెచ్చరికలు జారీ చేసింది.
జగన్ ప్రభుత్వంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రోడ్ల అధ్వాన్న స్థితిని తమ పార్టీ కార్యకర్తలు వెలుగులోకి తీసుకొస్తే దాడులు చేసి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మొన్న భీమవరం, అనకాపల్లి, నేడు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో పోలీసుల సమక్షంలోనే జనసేన నాయకులపై దాడులు చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేస్తే సమస్య పెద్దదవుతుంది తప్ప పరిష్కారం కాదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
జనసేన కార్యకర్తలపై దాడి జరిగితే నేనే స్వయంగా రోడ్లపైకి వస్తానని, ఆ పరిస్థితి తీసుకు రావద్దని జనసేనాని హెచ్చరించారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉందని, ఇక ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్న జనసేన నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం బాధాకరమని , ప్రభుత్వం రిపేర్లు చేయించాల్సింది పోయి ఇదేంటి అని అడిగిన వారిపై దాడులు చేయిస్తే ఎలా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమదాలవలసలో రోడ్ల దుస్థితి ఫ్లెక్సీ రూపంలో తెలియజేసినందుకు జనసేన నాయకుడలతో పాటుగా పార్టీ కార్యకర్తలపై పోలీసుల సమక్షంలోనే వైసిపి నాయకులు దాడులకు తెగబడ్డారు అని అన్నారు పవన్ కళ్యాణ్.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో రహదారుల దుస్థితిపై విన్నవించిన జనసేన నేత పేడాడ రామ్మోహన్‌రావు, జనసైనికులపై వైసీపీ వర్గీయులు దాడి చేయడాన్ని పవన్ కల్యాణ్ ఖండించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులతో ఫోన్లో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు పార్టీ అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో అధ్వానంగా మారిన రోడ్ల దుస్థితిపై వీడియోలు తీసి వాటిని ప్రదర్శించి ఉద్యమించాలని నిర్ణయం తీసుకున్న జనసేన సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఉద్యమించింది. ఆంధ్రప్రదేశ్ రోడ్ల కోసం జనసేన పార్టీ అనే నినాదంతో 1,26,000 కిలోమీటర్ల మేర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారులు తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లను బాగు చెయ్యటానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది. సెప్టెంబర్ 2,3,4 తేదీలలో రోడ్ల దుస్థితిపై నిరసన కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పరిస్థితిపై వీడియోలు తీసి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు షేర్ చేశారు.