సీఎం జగన్​ అపరభగీరథుడు.. పీపుల్స్​స్టార్​ ప్రశంసలు!

Update: 2020-11-18 03:30 GMT
ఏపీ సీఎం జగన్​ మోహన్​రెడ్డిపై ప్రముఖ నటుడు ఆర్​ నారాయణమూర్తి ప్రశంసలు గుప్పించారు. ఆయన గొప్ప దార్శనికుడని.. అపరభగీరథుడని కొనియాడారు. ఏలేరు, తాండవ రిజర్వాయర్లను అనుసంధానించాలని నారాయణమూర్తి సీఎం జగన్​కు విజ్ఞప్తి చేశారు. దీనిపై జగన్​ సానుకూలంగా స్పందించారు. దీంతో నారాయణమూర్తి.. సీఎం జగన్​కు ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు.  ఈ రెండు రిజర్వాయర్లను అనుసంధానిస్తే   తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు నీరు అందుతుందని.. తద్వారా ఈ రెండు జిల్లాలు మరింత సస్యశ్యామలం అవుతాయన్నారు.

రెండు జిల్లాల్లోని మెట్ట ప్రాంత రైతు సమస్యల సీఎం జగన్​ శాశ్వత పరిష్కారానికి చూపారని చెప్పారు. ఉత్తరాంధ్రలో 50 శాతానికిపైగా మెట్ట ప్రాంతాలు ఉన్నాయని, దీంతో ఈ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వలస పోతున్నారని ఆర్.నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. తాండవ రిజర్వాయర్‌ నుంచి మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించాలన్న తన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి.. వెంటనే తగిన కార్యాచరణ చేపట్టడం జగన్‌ చిత్తశుద్ధికి నిదర్శనమని నారాయణమూర్తి కొనియాడారు.

రూ.500 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ అనుసంధాన ప్రాజెక్ట్‌తో తాండవ, ఏలేరు ఆయకట్టుకు సాగునీరు అందుతుందని ఆర్.నారాయణమూర్తి తెలిపారు. సీఎం జగన్‌ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుందని నారాయణమూర్తి ప్రశంసించారు. సీఎం జగన్​ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్​ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు.
Tags:    

Similar News