రజనీకాంత్ కూతుళ్లలో ఒకరు మొదటి భర్తకు విడాకులు ఇచ్చి కొన్ని నెలల కిందట రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ కూతుళ్లలో ధనుష్ చేసుకున్న ఆమె కాకుండా మరో ఆమె రెండో పెళ్లి చేసుకుంది. మొదటి భర్తతో పడక ఆమె విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కొంత కాలానికి వేరే పెళ్లి చేసుకుంది. అది పూర్తిగా వారి వ్యక్తిగత వ్యవహారం. ఆమె రెండో పెళ్లి కూడా ఘనంగా జరిగింది. ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్తను ఆమె వివాహం చేసుకున్నట్టుగా ఉంది.
అదంతా వారి వ్యక్తిగత వ్యవహారం. అయితే ఇప్పుడు అది రాజకీయం ప్రస్తావించబడుతూ ఉంది. పెరియార్ పై ఇటీవల రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు అక్కడ దుమారం రేపుతూ ఉన్నాయి. నాస్తికుడు అయిన పెరియార్ సీతారాముల విగ్రమాలను అభ్యంతకరమైన రీతిలో ఊరేగించారని అంటూ రజనీకాంత్ వ్యాఖ్యానించారు. ఆ విషయంలో ద్రవిడ వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అటు డీఎంకే నుంచి, ఇటు అన్నాడీఎంకే నుంచి ఈ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
బీజేపీ వాళ్లు మాత్రం రజనీకాంత్ కు మద్దతుగా నిలుస్తున్నారు. తను చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదని రజనీకాంత్ కూడా గట్టిగా సమర్థించుకుంటూ ఉన్నారు. తను క్షమాపణలు చెప్పే సమస్యే లేదని రజనీకాంత్ అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో అన్నాడీఎంకే నేత - మంత్రి సెల్లూరు రాజు మాట్లాడుతూ.. రజనీ తీరును తప్పు పట్టారు. తమిళనాట సంస్కరణలకు పెరియార్ రామస్వామి నాయకర్ ఆద్యులు అని ఆ మంత్రి అన్నారు.
పెరియార్ సమయంలో సామాజికంగా మొదలైన సంస్కరణలతోనే అనేక మార్పులు వచ్చాయని ఆ మంత్రి చెప్పుకొచ్చాడు. అంతటితో ఆగక.. రజనీకాంత్ కూతుళ్లలో ఒకరు రెండో పెళ్లి చేసుకున్నారన్నా అందుకు పెరియార్ సంస్కరణలే కారణం అని ఆ మంత్రి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు సహజం అయిపోయాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ కూతురు ప్రస్తావన తెచ్చేసినట్టుగా ఉన్నారు తమిళ రాజకీయ నేతలు.