పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంపై దేశ ప్రజల స్పందన ఏమిటి? నల్లబాబుల గుండెల్లో రైళ్లు పరిగెత్తటమే కాదు.. తమ జీవితంలో మోడీని ఎప్పటికి క్షమించరన్నది తెలిసిందే. మరి.. సామాన్యుల మాటేమిటి? అన్న ప్రశ్నకు సమాధానం దొరికేసింది. మోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తోంది.
ఎందుకంటే.. ఆయన ట్విట్టర్ ఖాతాను ఫాలో అవుతున్న దాదాపు మూడున్నర లక్షల మంది మోడీ ఖాతాను వదిలి వెళ్లిపోవటమే దీనికి కారణం. కొత్త నోట్లు.. వంద నోట్ల కోసం ఏటీఎంల వద్ద.. బ్యాంకుల వద్ద క్యూల్లో నిలుచొని నానా అవస్థలు పడుతున్న వారంతా తమ కోపాన్ని. . ఆగ్రహాన్ని మోడీ ట్విట్టర్ అకౌంట్ ను అన్ ఫాలో కావటంతో ద్వారా బదులు తీర్చేసుకుంటున్నారు.
కొత్త నోట్ల రద్దు అనంతరం దాదాపు ఆయన అకౌంట్ ను ఫాలో అయ్యే వారిలో దాదాపుగా 3.5లక్షల మంది వెళ్లిపోవటం గమనార్హం. అయితే.. నల్లధనం.. అవినీతి మీద మోడీ ఇచ్చిన వివరణతో ఆయనపై కోపాన్ని తగ్గించుకొని మళ్లీ కొందరు ఫాలో అవుతున్నారు. ఏమైనా.. మోడీ పెద్దనోట్ల నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతున్నా.. అది తమ లాంటి సామాన్యులకు తిప్పలు పెట్టటంపై మాత్రం జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/