ఫోర్బ్స్ శ‌క్తివంతుల జాబితాలో మోడీ

Update: 2016-12-15 11:48 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి అంత‌ర్జాతీయ స్థాయిలో ద‌క్కుతున్న గుర్తింపున‌కు మ‌రో నిద‌ర్శ‌నం. ప్ర‌ముఖ ప‌త్రిక‌ ఫోర్బ్స్‌ రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతుల జాబితాలో తొలి 10 మందిలో ప్ర‌ధాన‌మంత్రి చోటు దక్కించుకున్నారు. మోడీకి ఇందులో తొమ్మిదో ర్యాంక్ ద‌క్కింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వరుసగా నాలుగో సంవత్సరం ప్రథమ స్థానంలో నిలిచారు. అమెరికా కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రెండో స్థానంలో నిలిచారు.

మొత్తం 74 మంది అత్యంత శక్తిమంతులతో కూడిన జాబితాను విడుద‌ల చేసిన ఫోర్బ్స్  130 కోట్ల జనాభా గల భారత్‌లో మోడీ అత్యంత ప్రజాదరణ గల నేతగా కొనసాగుతున్నారని ప్ర‌శంసించింది. మోడీ అనేక నిర్ణ‌యాలు తీసుకున్నార‌ని ప్ర‌శంసించింది. దేశంలో అవినీతి - న‌ల్ల‌ధ‌నం చలామణీని తగ్గించటానికి ఇటీవల తీసుకున్న పెద్ద నోట్ల ఉపసంహరణ నిర్ణయాన్ని ఫోర్బ్స్ ప్ర‌శంసించింది. మ‌రోవైపు క్రైస్త‌వ పీఠాధిప‌తి పోప్‌ ఫ్రాన్సిస్ 5 వ‌స్థానంలో - మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్ 7 వ స్థానంలో - ఫేస్‌ బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్ 10 వ స్థానంలో నిలిచించారు. యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ (32) - ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (43) - అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా (48) - ఐసిస్‌ నేత అబూ బకర్‌ అల్‌ బాగ్దాదీ (57) స్థానాల్లో ఉన్నారు.

మ‌రోవైపు కేంద్ర విదేశాంగ శాఖామంత్రి సుష్మాస్వ‌రాజ్ కు మ‌రో విశిష్ట‌ జాబితాలో చోటు ద‌క్కింది. 'ది ఫారిన్ పాలసీ' పత్రిక 2016 ఏడాదికిగానూ విడుద‌ల చేసిన ప్రపంచ మేధావుల జాబితాలో స్థానం పొందారు. విధాన రూపకల్పనల విభాగంలో  సుష్మ ఎంపికైంద‌ని తెలిపింది. ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తీర్చ‌డంలో ముందుండే సుష్మకు గుర్తింపుగా... 'కామన్ ట్వీపుల్(ట్విటర్) నాయకురాలు' అని 'ది ఫారిన్ పాలసీ' పత్రిక ప్ర‌శంసించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News