హైదరాబాద్ కు కరోనా తీసుకొచ్చిన యువకుడి కుటుంబంపై పోలీస్ కేసు నమోదైంది. సికింద్రాబాద్ లోని మహేంద్ర హిల్స్ కాలనీలో ఉండే సదురు యువకుడు దుబాయ్ వెళ్లి అక్కడ కరోనా అంటించుకొని వచ్చి హైదరాబాద్ లో తొలి కేసు వ్యక్తిగా నమోదైన సంగతి తెలిసిందే.
ఇక ఈ యువకుడే కాదు... ఇతడి కుటుంబ సభ్యులను కూడా పిలిపించి వైద్యులు కరోనా టెస్ట్ చేశారు.అయితే వారికి కరోనా సోకలేదని తేలింది. దీంతో మీరు ఎవరిని కలవవద్దని... కేవలం ఇంట్లోనే ఉండాలని వైద్యులు సూచించారు.
అయితే వైద్యులు సూచించినా కరోనా సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులు వినడం లేదని పక్కింటి వారితో పాటు కాలనీలో సంచరిస్తున్నారని మహేంద్రహిల్స్ కాలనీ అధ్యక్షుడు సంజీవరెడ్డి తాజాగా అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కరోనా సోకిన వ్యక్తి కుటుంబం మరికొందరు ఇళ్లకు వెళుతున్నారని... బయట సంచరిస్తున్నారని ఫిర్యాదు చేశాడు.
వీరి వల్ల మరికొందరికి కరోనా సోకే ప్రమాదం ఉందని... ఇకనైనా వారి కుటుంబ సభ్యులను ఇతరులతో కలవకుండా చూడాలని పోలీసులను, అధికారులను కోరారు.