ఏపీలో సంచలనంగా మారిన ఫ్యామిలీ సూసైడ్ పై సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పోలీసుల వేధింపులను తట్టుకోలేక తాను.. తన కుటుంబం ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా పేర్కొంటూ కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన షేక్ అబ్దుల్ సలాం ఫ్యామిలీ సూసైడ్ చేసుకోవటం తెలిసిందే.
తీవ్ర సంచలనంగా మారిన ఈ ఉదంతాన్ని జగన్ తీవ్రంగా పరిగణించారు. పోలీసుల వేధింపుల వల్లే.. తాను.. తన భార్య.. పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. అనంతరం.. కర్నూలు జిల్లా కౌలూరు వద్ద గూడ్సురైలు కింద పడి సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
దీనిపై స్పందించిన సీఎం జగన్.. తక్షణ విచారణ చేపట్టాలని డీజీపీ సవాంగ్ ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో బెటాలియన్స్ ఐజీ శంకబ్రత బాగ్చి.. గుంటూరు అడిషనల్ ఎస్పీ హఫీజ్ ను విచారణ అధికారులుగా నియమిస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.
ఉమ్మడి ఏపీలో పలు జిల్లాల్లో ఎస్పీగా పని చేసిన శంకబ్రత బాగ్చీకి నిజాయితీ పోలీసు అధికారిగా మంచి పేరుంది. అలాంటి ఆయనకు ఈ కేసును తేల్చేందుకు నియమించటం.. బాధితులకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు.ఇక.. ఈ ఉదంతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నంద్యాల వన్ టౌన్ సీఐ సోమశేఖర్ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.