ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించింది. కానీ.. ఆ రెండు చోట్ల మాత్రమే టీడీపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. దీంతో.. అందరి చూపూ ఆ మునిసిపాలిటీలపైనే పడింది. అవే.. తాడిపత్రి, మైదుకూరు. తాడిపత్రిలో వ్యహారం రంజుగా సాగుతుండగా.. మైదుకూరు వ్యవహారం మాత్రం క్లైమాక్స్ కు చేరింది.
ఇక్కడ మొత్తం 24 వార్డులు ఉండగా.. ఇందులో టీడీపీ 12 స్థానాలు, వైసీపీ 11 స్థానాలు, జనసేన ఒకటి దక్కించుకున్నాయి. దీంతో.. చైర్మన్ గిరీ ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ మొదలైంది. రాజకీయం పలు మలుపులు తిరగడంతో అది తారస్థాయికి చేరింది.
అయితే.. టీడీపీ, జనసేన పొత్తు కలుస్తాయనే అంచనాలు వేశారు చాలా మంది. ఆ విధంగా వారి బలం 13కు చేరుతుందని భావించారు. ఇటు వైసీపీ 11 స్థానాలకుతోడు రెండు ఎక్స్ అఫీషియో ఓట్లు ఉండడంతో వైసీపీ బలం కూడా 13 స్థానాలకు చేరింది. దీంతో.. టెన్షన్ మరింతగా పెరిగిపోయింది.
ఈ ఉత్కంఠ నడుమనే గురువారం సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహించారు. అయితే.. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అనూహ్యంగా ఇద్దరు సభ్యులు గైర్హాజరయ్యారు. వారిలో టీడీపీకి చెందిన 6వ వార్డు సభ్యురాలు మొహబూబీ, జనసేన సభ్యుడు బాబు ఉన్నారు. ఫలితంగా.. తెలుగుదేశం పార్టీ సభ్యుల సంఖ్య 11కు పడిపోయింది. వైసీపీ బలం మాత్రం యథావిధిగా 13 ఉంది. దీంతో.. మునిసిపల్ చైర్మన్ సీటు వైసీపీకే దక్కడం ఖాయమైంది. ఈ మేరకు అధికారులు ప్రకటించే అవకాశం ఉంది.