రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్రెస్ గల్లంతైన కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు - ఆ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేసిన కామెంట్లు... టీ కాంగ్ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డిని ఆగ్రహావేశాలకు గురి చేసిందనే చెప్పాలి. అభివృద్ధి మాట అంటే అర్థం కూడా తెలియని కాంగ్రెస్ పార్టీ నేతలు... తాము చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై విమర్శలు చేస్తున్నారని, ఈ వ్యవహారమంతా ఫన్నీగానే అనిపిస్తోందన్న విరుచుకుపడ్డ కేటీఆర్... గ్రాండ్ ఓల్డ్ పార్టీని ఫన్నీ కాంగ్రెస్ అంటూ ఎద్దేవా చేశారు.
ఈ కామెంట్ పై కాస్తంత ఆలస్యంగా మేల్కొన్న పొంగులేటి సుధాకర్ రెడ్డి... కాసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చి టీఆర్ఎస్ అండ్ కోపై విరుచుకుపడ్డారు. తమ పార్టీని ఫన్నీ కాంగ్రెస్ అంటావా... జాగ్రత్త అంటూ కేటీఆర్ కు ఏకంగా వార్నింగ్ ఇచ్చారు. ఓ స్థాయిలో ఉన్నప్పుడు పద్ధతిగా మాట్లాడాలని సుద్దులు చెప్పే కేసీఆర్ ముందుగా తన కుమారుడు కేటీఆర్ కు ఆ పద్ధతి ఏమిటో నేర్పాలని కూడా ఓ సలహా పడేశారు.
టీఆర్ ఎస్ పాలనలో ప్రజల ముఖాల్లో ఆనందం కనిపించడం లేదని, గులాబీ గూటికి చేరిన ఇతర పార్టీ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్ కుమార్ లాంటి నేతల కళ్లల్లో మాత్రమే ఆనంద కనిపిస్తోందని కూడా ఆయన ఫైరయ్యారు. అసలు ప్రజల ఉసురు ఎవరికి తగులుందన్న అంశంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించిన పొంగులేటి... దానిపైనా వివరణ ఇచ్చారు. రైతులకు సంకెళ్లు వేయాలన్న టీఆర్ ఎస్ కే ప్రజల ఉసురు తగులుందని ఆయన తేల్చేశారు. రైతులకు సంకెళ్లు వేయొద్దన్న తమకు ప్రజల ఉసురు ఎందుకు తగులుతుందని టీఆర్ఎస్ నేతలను ఎదురు ప్రశ్నించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/