మా ఊళ్లో మందు షాపు పెట్టించాలంటూ నిర‌స‌న‌

Update: 2017-12-02 09:36 GMT
ఎక్క‌డైనా బ‌డి కావాలంటూ రోడ్డు మీద‌కు వ‌స్తారు. గుడి ఏర్పాటు చేయాల‌ని ఆందోళ‌న చేస్తారు. లేదంటే.. క‌రెంటు కావాల‌నో.. రోడ్లు వేయాల‌నో..తాగు నీరు సౌక‌ర్యం ఏర్పాటు చేయాల‌నో ఆందోళ‌న బాట ప‌ట్ట‌టం చూస్తాం. కానీ.. ఇక్క‌డి వ్య‌వ‌హారం కాస్త డిఫ‌రెంట్‌. క‌ల‌లో ఊహించ‌ని రీతిలో వీరు చేస్తున్న నిర‌స‌న ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

ఏపీలోని ప్ర‌కాశం జిల్లా ముఖ్య‌కేంద్రం ఒంగోలులో గ్రామ‌స్తులు కొంద‌రు నిర‌స‌న బాట ప‌ట్టారు. ఎందుకంటే.. త‌మ ఊళ్లో మ‌ద్యం షాపు ఏర్పాటు చేయాల‌న్న‌ది వీరి డిమాండ్‌. ఏంది.. మ‌ద్యం షాపు పెట్టాలంటూ ఆందోళ‌న కూడా చేస్తున్నారా? అది కూడా.. ఆడ‌మ‌గా..? అంటూ బుగ్గ‌లు నొక్కోవ్వాల్సిన అవ‌స‌రం లేదు. వీరతో మాట్లాడి.. ఎందుకిలాంటి డిమాండ్ చేస్తున్నారంటే.. ఉన్న‌ది ఉన్న‌ట్లుగా చెప్పే వైనం.. వారి లాజిక్కు వింటే షాక్ తినాల్సిందే.

మ‌ద్యం షాపుల్ని తీసేయాలంటూ నిర‌స‌న చేయ‌టం చూశాం కానీ.. అందుకు భిన్నంగా మ‌ద్యం షాపు ఏర్పాటు చేయాలంటూ నిర‌స‌న చేస్తున్న దానికి గ్రామ మ‌హిళ‌లు చెప్పే లాజిక్కేమిటంటే..

త‌మ మ‌గాళ్లు ఎం చెప్పినా మందు తాగ‌టం మాన‌రు. ఊళ్లో మందు షాపు లేక‌పోవ‌టంతో ఊరికి తొమ్మిది కిలోమీట‌ర్ల దూరాన ఉన్న మ‌ద్యం షాపుకు వెళ్లి.. అక్క‌డ పూటుగా తాగేసి.. అక్క‌డే ప‌డిపోతున్నారు. ఇంటికి తీసుకురావ‌టం క‌ష్ట‌మ‌వుతుంది. కొంత‌మంది తాగి తిరిగి ఇంటికి వ‌చ్చేట‌ప్పుడు యాక్సిడెంట్ల‌కు గురి అవుతున్నారు.

ఈ తిప్ప‌లు ఏమీ లేకుండా ఊళ్లోనే మ‌ద్యం షాపు ఏర్పాటు చేస్తే.. తాగేదేదో ఊళ్లోనే తాగేసి ఇంటికి వ‌చ్చి ప‌డిపోతార‌ని చెబుతున్నారు. ఒక‌వేళ తాగి ప‌డిపోయినా.. ఊళ్లోనే కాబ‌ట్టి ఇంటికి తెచ్చుకోవ‌టం ఇబ్బంది ఉండ‌ద‌ని చెబుతున్నారు. మ‌ద్యం షాపులు పెట్టాలంటూ ఆడాళ్లు రోడ్ల‌మీద‌కు వ‌చ్చారా? అని అనుకునే ముందు వారు చెప్పే లాజిక్కు వింటే.. నిజ‌మే క‌దా అనిపించ‌క మాన‌దు.వినేందుకు కొత్త‌గా ఉన్నా.. వారి లెక్క‌లో న్యాయం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Full View
 
Full View
Tags:    

Similar News