బీఫ్‌ కు ​​ పెస్టివ‌ల్‌ కు పంచ్ రెడీ అయింది

Update: 2015-12-03 06:31 GMT
ప్రపంచ మానవ హక్కుల దినం సంద‌ర్భంగా ఈ నెల 10న ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక (డీసీఎఫ్‌) ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించతలపెట్టిన 'బీఫ్‌ ఫెస్టివల్‌'పై రాద్ధాంతం మొదలైంది. దీన్ని అడ్డుకునేందుకు హిందుత్వ సంస్థలు కుయుక్తులు పన్నుతున్నాయనే వాద‌న‌లో ఇపుడు మ‌రో అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. తమ ఆహారపు అలవాట్లపై ఇతరుల పెత్తనాన్ని సహించబోమని హెచ్చరిస్తు వ‌స్తున్న ప‌లువురు మతం రంగు పులిమి గ్రేటర్‌ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు బీజేపీ రంగంలోకి దిగిందని విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో త‌మ‌ను రెచ్చగొట్టేందుకు బీజేపీ మ‌రో రూపంలో కుట్ర చేస్తోంద‌ని ఆరోపిస్తున్నారు. 'బీఫ్‌'కు పోటీగా పోర్క్‌ ఫెస్టివల్ ను ఏర్పాటుచేయ‌డం ఇందులో భాగ‌మేన‌ని విమ‌ర్శిస్తున్నారు.

బీఫ్‌ పై ఆంక్షలు వద్దంటూ ఈ నెల 10న ఉస్మానియాలో 'పెద్దకూర' పండుగ నిర్వహించేందుకు అభ్యుదయ - సామాజిక విద్యార్థిసంఘాలు నిర్ణయించిన సంగ‌తి తెలిసిందే. ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో దళిత - గిరిజన - బహుజన - అభ్యుదయ - మైనార్టీతో పాటు సుమారు 26 సంఘాలు వీటిని నిర్వహించేందుకు ముందుకు వచ్చాయి. అయితే ఈ కార్య‌క్ర‌మాన్ని అడ్డుకునేందుకు బీజేపీ రంగంలోకి దిగింది. జిల్లా కలెక్టర్‌ తో పాటు ఓయూ ఇన్‌ ఛార్జీ వీసీ రంజిత్‌ ఆర్‌ ఆచార్యను కలిసి ఫిర్యాదు చేశారు.  బీఫ్ ఫెస్టివ‌ల్‌ ను ఆపకపోతే మరో దాద్రి వంటి మ‌రో ఘటన జరుగుతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. అడ్డుకునేందుకు 10న 'చలో ఉస్మానియా చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

అయితే బీఫ్‌ ఫెస్టివల్‌ కు పోటీగా ఈ నెల 10న ఓయూ జేఏసీ పేరుతో పోర్క్‌ ఫెస్టివల్‌ - గిరిజన జేఏసీ పేరుతో బోటీబాటీ సలారు అనే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధ‌మ‌య్యాయి. ఈ పందికూర పండుగ బీఫ్ ఫెస్టివ‌ల్‌ కు వ్య‌తిరేక‌మనే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అయితే తాము బీఫ్‌ ఫెస్టివల్‌ కు వ్యతిరేకంగా కాదని, అలాగని మద్దతూ ఇవ్వడం లేదని పోర్క్‌ ఫెస్టివల్‌ నిర్వాహకులు ఎస్‌.శ్రీనివాస్‌ తెలిపారు. వారి ఆహార అల‌వాట్ల ప్ర‌కారం బీఫ్ తింటే..తాము ఫోర్క్ తింటున్నామ‌ని ప్ర‌క‌టించారు. మ‌రోవైపు  ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఈ నెల 10న ఆర్ట్‌ కళాశాల వద్ద బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తామని డీసీఎఫ్‌ నేతలు ప్ర‌క‌టించారు. ప్రజా సంఘాల మద్దతు కూడగట్టేందుకు ఈ నెల 5న వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాలతో కలిసి రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని,7న 5కే రన్‌ నిర్వహిస్తామని వారు చెబుతున్నారు. ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారిన నేప‌థ్యంలో ఓయూలో పోలీసులు పటిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేస్తున్నారు.
Tags:    

Similar News