ఏపీలో ప్ర‌త్యేక హైకోర్టుపై క్లారిటీ వ‌చ్చేసింది

Update: 2017-08-11 11:28 GMT
ఏపీకి సంబంధించిన ఒక కీల‌క విష‌యంపై ఒక స్ప‌ష్ట‌త వ‌చ్చింది. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి మూడున్న‌రేళ్లు అయిన త‌ర్వాత కూడా ఏపీ రాష్ట్ర రాజ‌ధానిగా చెబుతున్న అమ‌రావ‌తిలో ఇప్ప‌టివ‌ర‌కూ శాశ్విత క‌ట్ట‌డం ఏర్పాటు చేసింది లేదు. మ‌రోవైపు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. హైకోర్టు విభ‌జ‌న పై ఇప్ప‌టికే ప‌లుమార్లు త‌న డిమాండ్ ను వినిపించారు. హైకోర్టు విభ‌జ‌న కాక‌పోవ‌టంపై ఇప్ప‌టికే ఆయ‌న త‌న అసంతృప్తిని బాహాటంగానే వ్య‌క్తం చేశారు.
ఇదిలా ఉంటే.. ఏపీలో ప్ర‌త్యేక హైకోర్టును ఎప్పుడు ఏర్పాటు చేస్తార‌న్న అంశంపై కేంద్ర స‌హాయ మంత్రి పీపీ చౌద‌రి స్ప‌ష్ట‌త ఇచ్చారు.

కోర్టు భ‌వ‌నాలు.. న్యాయ‌మూర్తులు.. అధికారులు.. సిబ్బందికి క్వార్ట‌ర్లు త‌దిత‌ర వ‌స‌తుల‌న్నీ సిద్ధ‌మైన త‌ర్వాతే ఏపీలో ప్ర‌త్యేకంగా హైకోర్టు ఏర్పాటు జ‌రుగుతుంద‌న్న విష‌యాన్నికేంద్ర న్యాయ‌శాఖ స‌హాయ‌మంత్రి పీపీ చైద‌రి స్ప‌ష్టం చేశారు. ఏపీలో హైకోర్టు ఎప్పుడు ఏర్పాటు చేయ‌నున్నారు? అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ‌ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి అడిగిన ప్ర‌శ్న‌కు మంత్రి రాత‌పూర్వ‌కంగా జ‌వాబిచ్చారు.

హైద‌రాబాద్ లోని హైకోర్టుతో సంప్ర‌దించి ఈ వ‌స‌తుల్ని క‌ల్పించాల్సిన బాధ్య‌త రాష్ట్ర ప్ర‌భుత్వం పైనే ఉంద‌న్నారు. ఏపీ ప్ర‌త్యేక హైకోర్టు ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా హైకోర్టు ప్ర‌ధాన‌న్యాయ‌మూర్తికి.. ఏపీ సీఎంను  కేంద్ర‌ప్ర‌భుత్వం కోరిన‌ట్లుగా వెల్ల‌డించారు. ప్ర‌త్యేక హైకోర్టు ఏర్పాటు విష‌యంలో ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య వివాదం ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోని హైకోర్టు విచార‌ణ‌లో ఉన్న‌ట్లు చెప్పారు. తాజాగా న్యాయ స‌హాయ మంత్రి ఇచ్చిన స‌మాధానం చూస్తే.. ఏపీలో హైకోర్టు ఏర్పాటుకు మ‌రికొన్నేళ్లు ప‌ట్ట‌టం ఖాయ‌మ‌న్న‌ట్లుగా క‌నిపిస్తుంది.  ఈ  విష‌యం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు అసంతృప్తిని క‌లిగించే అవ‌కాశం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News