తెలంగాణ సీఎం కేసీఆర్, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇద్దరి దారులు ఇప్పుడు ఒక్కటే. ఇద్దరికీ మోడీ అంటే పడడం లేదు. మోడీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్యమించేందుకు రెడీ అయ్యారు. ఇద్దరూ మోడీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు.
తాజాగా మహారాష్ట్ర పర్యటనలో ఎవ్వరూ ఊహించని వ్యక్తి తారసపడ్డారు. కేసీఆర్ హైదరాబాద్ నుంచి ముంబైకి ప్రత్యేక విమానంలో వెళ్లి ఎయిర్ పోర్టులో దిగగానే ఆయనకు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ స్వయంగా స్వాగతం పలికడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
బీజేపీకి ప్రత్యామ్మాయంగా జాతీయస్థాయిలో ఒక కూటమి ఏర్పాటులో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఆయన మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో చర్చించేందుకు ముంబై వెళ్లారు. ముంబై విమానాశ్రయంలో అనూహ్య రీతిలో కేసీఆర్ బృందానికి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ స్వాగతం పలకడం చర్చనీయాంశమైంది.
ప్రకాష్ రాజ్ స్వాగతానికి ఫిదా అయిన కేసీఆర్ తన వెంట వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నేతలను ప్రకాష్ రాజ్ కు పరిచయం చేశారు. అనంతరం కేసీఆర్ బృందం మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే అధికార నివాసానికి చేరుకుంది. లంచ్ అనంతరం ఇద్దరు సీఎంలు సమావేశమయ్యారు. ఈ సమావేశం అన్నింట్లోనూ ప్రకాష్ రాజ్ పాల్గొనడం విశేషం.
ఇప్పటికే ప్రకాష్ రాజ్ మోడీపై విరుచుకుపడుతున్నారు. మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నారు. కర్ణాటక నగరంలో బీజేపీపై పోటీగా ఎంపీగా నిలబడ్డారు. ఇక మోడీ విధానాలను, ట్వీట్ల రూపంలో ఎండగడుతూ విమర్శిస్తుంటారు.
ఇటీవల 'మా' అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొన్న ప్రకాష్ రాజ్ .. మంచు విష్ణు ప్యానెల్ చేతిలో ఓడిపోయింది. అనంతరం తెలుగు సినీ పరిశ్రమలో, బయటా ఎక్కువగా ప్రకాష్ రాజ్ కనిపించడం లేదు. తాజాగా సడెన్ గా కేసీఆర్ తోపాటు కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.