గతంలో ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీలో ఒక పరిణామం చోటు చేసుకుంటోంది. శతాధిక పార్టీ.. తనను అధికారంలోకి తీసుకొచ్చే వారి కోసం ఆశగా ఎదురుచూస్తోంది. గాంధీ కుటుంబమే తమ పార్టీకి కీలక ఆయుధమని నమ్మే కాంగ్రెస్.. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి చోటు చేసుకుంది. ఇంతకాలం బలంగా భావించిన గాంధీ కుటుంబమే పార్టీకి బలహీనంగా మారటం వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇందిర పోలికలతో ఉన్న ప్రియాంక ఏదో చేస్తారన్న ఆశ ఐదేళ్ల క్రితం ఆ పార్టీలో ఉండేది. ఇప్పుడు ఎవరికి అలాంటి భ్రమలు లేని పరిస్థితి. చూస్తూ.. చూస్తూ గాంధీ ఫ్యామిలీని వదులుకోలేని ఆ పార్టీ.. తమ భవిష్యత్తు ఏమిటి? మోడీ లాంటి అమేయమైన శక్తిని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై కిందా మీదా పడుతోంది.
ఇలాంటివేళ.. మోడీని ఇంత శక్తివంతుడిగా మార్చి.. అనితరసాధ్యమైన ఇమేజ్ ను సొంతం చేసి ఆయన్ను గెలుపు గుర్రం ఎక్కించినట్లుగా ప్రచారం జరిగే పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ మీద కొత్త ఆశల్ని పెట్టుకుంది. తమ పార్టీకి మార్గదర్శకంగా ఉంచుకోవాలన్న ఆలోచన ఉన్నప్పటికీ.. అది పార్టీకి మేలు చేస్తుందా? కీడు చేస్తుందా? అన్న సందేహంతో తర్జనభర్జనకు గురవుతోంది. మరోవైపు మోడీకి వ్యతిరేకంగా జట్టు కట్టే విషయంలో కాంగ్రెస్ అవసరాన్ని గుర్తించిన పీకే.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
అందులో భాగంగా ఆ పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. విచిత్రమైన విషయం ఏమంటే.. ఓవైపు కాంగ్రెస్ మీద పీకేకు ఆశ.. ఇంకో వైపు ప్రశాంత్ కిశోర్ మీద కాంగ్రెస్ చాలానే అంచనాలు పెట్టుకుంది. ఇలాంటి వేళ.. కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసేందుకు పీకే ప్రజంటేషన్ సిద్దం చేయటం..పార్టీలోని లోపాల్ని ఎత్తి చూపే విషయంలో ఎలాంటి మొహమాటానికి గురి కాకుండా ఉన్న విషయాల్ని ఉన్నట్లుగా చెప్పే ప్రయత్నం చేశారనిపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పీకే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
పార్టీ అధినాయకత్వం.. పార్టీ నేతలతో.. కార్యకర్తలతో పూర్తిగా సంబంధాలు కోల్పోయారని పీకే అభిప్రాయపడినట్లుగా చెబుతున్నారు. ఆ సంబంధాల్ని పునరుద్ధరించుకుంటేనే పార్టీ తిరిగి బలోపేతమయ్యే చాన్సులు ఉంటాయని చెప్పినట్లుగా తెలుస్తోంది. పార్టీ నేతలతో బీజేపీ నాయకత్వం నిత్యం సంబంధాలు పెట్టుకుంటుందని.. తరచూ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహిస్తూ రివ్యూ చేస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా కాంగ్రెస్ నేత ఒకరు చెప్పటం గమనార్హం. కాంగ్రెస్ దిశానిర్దేశం లేని పార్టీగా మారిందని.. పరిస్థితులు మారితేనే ఎన్నికల్లో గెలుస్తుందని చెప్పినట్లుగా చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో 70 శాతం జిల్లా అధ్యక్షులతో అటు సోనియా గాంధీ కానీ ఇటు రాహుల్ గాంధీ కానీ సమావేశాలు నిర్వహించలేదని చెప్పటంతో పాటు.. ఢిల్లీ స్థాయిలో ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శులు.. ఇన్ ఛార్జి నేతలతో కూడా 90 శాతం బ్లాక్ అధ్యక్షులతో సమావేశాలు నిర్వహించలేదన్న విషయాన్ని కాంగ్రెస్ అధినాయకత్వానికి నివేదించినట్లుగా చెబుతున్నారు.
ఇదంతా చూస్తే.. పార్టీ తప్పుల్ని ఎత్తి చూపే విషయంలో పీకే ఏ మాత్రం మొహమాటానికి గురి కావటం లేదన్న విషయం స్పష్టమవుతుంది. మరి.. కాంగ్రెస్ ను పీకే లేపుతాడా? తన మీద మరింత ఆధారపడేలా చేసి ముంచేస్తాడా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.