రాజకీయ వ్యూహకర్త.. ప్రశాంత్ కిశోర్‌ను పార్టీలో చేర్చుకునివచ్చే ఎన్నికల్లో కేంద్రంలో పాగా వేయాలని భావి స్తున్న కాంగ్రెస్ అధిష్టానానికి.. ఆదిలోనే పెద్ద దెబ్బతగిలింది. ఆయన నియామకాన్ని.. పార్టీలో చేరడాన్ని కూడా.. సీనియర్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పీకేను పార్టీలో చేర్చుకోవాలని మెజారిటీ నేతలు భావిస్తుండగా, చేరకుండా అడ్డుకునేందుకు మరి కొందరు ప్రయత్నిస్తున్నారు. అయితే, పార్టీ చీఫ్ సోనియా గాంధీ మాత్రం ఈ విషయంపై మౌనం పాటిస్తున్నారు.
అయితే, పార్టీపరంగా రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు సోనియా ఏర్పాటు చేసిన సాధికారిక కార్యాచర ణ బృందానికి ప్రశాంత్ కిశోర్ సారథ్యం వహించే అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎనిమిది మంది సభ్యులు సమర్పించిన నివేదిక ఆధారంగా సోనియాగాంధీ ఈ బృందాన్ని ఏర్పాటు చేశారని, 2024 ఎన్నికలకు ఈ బృందం టాస్క్‌ఫోర్స్‌గా పనిచేస్తుంది. ఇక, ప్రశాంత్ కిశోర్ కాంగ్రె్‌సలో చేరే విషయంలో జాతీయ స్థాయిలో ప్రియాంకాగాంధీ, అంబికా సోనీ తదితరులు సుముఖంగా ఉండగా, దిగ్విజ య్సింగ్, ముకుల్ వాస్నిక్, రణదీప్ సుర్జేవాలా, జైరాం రమేశ్ వంటివారు వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
కారణం ఏంటి?
కాంగ్రెస్ సీనియర్లు పీకేను వ్యతిరేకించడానికి ఆయనకు ఉన్న రాజకీయ విస్తృత సంబంధాలేనా? అనేది ప్రశ్న. ఎందుకంటే..ఐప్యాక్ ద్వారా.. పీకే.. అన్ని రాష్ట్రాల్లోనూ రాజకీయాలను చక్కబెడుతున్నారు. ఇప్పుడు దీనిపైననే కాంగ్రెస్ నేతలు సీరియస్‌గా ఉన్నారు. ఐప్యాక్‌ను మూసివేసుకోవాలని, ఇతర పార్టీలతో సంబంధాలు తెంచుకోవాలని కొందరు నేతలు అంటున్నారు. ఏపీలో వైసీపీ, తెలంగాణలో టీఆర్ ఎస్‌తోపాటు పశ్చిమబెంగాల్, బిహార్‌లలో కాంగ్రె్‌సకు ప్రత్యర్థులైన పార్టీలతో ఆయనకు సంబంధా లున్నాయనేది వీరి అభ్యంతరం.
దీంతో కాంగ్రెస్ పట్ల పీకే అంకితభావంపై సందేహాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీలో చేరికకు ముందే ప్రశాంత్ కిశోర్ నుంచి స్పష్టత కోరాలని సోనియాకు వారు సూచించినట్లు తెలిసింది. అయితే తాను ఐప్యాక్ నుంచి తెగదెంపులు మాత్రమే చేసుకుంటానని, ఆ సంస్థ టీఆర్ ఎస్‌తోపాటు మిగతా పార్టీల కోసం పనిచేస్తుందని పీకే చెబుతున్నారట. ఈ అంశంపై కూడా కాంగ్రెస్‌లో తర్జన భర్జనలు మొదలయ్యా యి.
ఇలా చేయడం తగునా?!
ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చలు జరుపుతూనే మధ్యలో హైదరాబాద్‌కు వెళ్లి టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మంతనాలు జరపడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ బహిరంగంగానే తన అభ్యంతరాన్ని వెల్లడించారు. ''శత్రువుకు మిత్రులైన వారిని ఎప్పుడూ నమ్మవద్దు'' అంటూ ఠాగూర్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా తెలంగాణలోని పలువురు కాంగ్రెస్ నేతలకు ఠాగూర్ ఫోన్లు చేస్తూ.. ప్రశాంత్ కిశోర్‌ను వ్యతిరేకించాల్సిం దిగా ఒత్తిడి చేస్తున్నారని సమాచారం.ఇలా ఏ విధంగా చూసుకున్నా.. పీకేను వద్దనేదే.. కాంగ్రెస్‌లోని మెజారిటీ నేతల మనోభావంగా ఉందని అంటున్నారు.