సానుకూలంగా ఉన్న వాతావరణాన్ని చెడ్డగొట్టుకొని.. తమకు ప్రతికూలంగా మార్చుకోవటంలో ఏపీ టీడీపీ నేతలకు మించిన వారు ఉండరేమో. ఏపీకి ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తున్న ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అవాకులు చవాకులు పేలి.. దిద్దుకోలేని తప్పు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ ఆరు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నా.. అటు ప్రజల్లోనూ.. ఇటు ప్రభుత్వంలోనూ పెద్ద స్పందన లేదన్న భావన వ్యక్తమవుతున్న సమయంలో.. ఏపీ మంత్రులు చేసిన బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలపై ‘తమ్ముళ్లు’ తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ దీక్ష గురించి నిన్న.. మొన్నటి వరకూ పెద్దగా ప్రస్తావించుండా ఉన్న వారు ఆదివారం చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదాన్ని సృష్టించటమే కాదు.. జగన్ మీద సానుభూతిని పెంచేలా చేశాయి. జగన్ చేస్తున్న దీక్షపై పలు సందేహాలు వ్యక్తం చేయటంతో పాటు.. ఆయన రెండు గంటలకోసారి ఆహారం తీసుకుంటూ దీక్ష చేస్తున్నారంటూ మంత్రి పుల్లారావు చేసిన వ్యాఖ్యలపై పలువురు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక.. వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులైతే.. మండిపడుతున్నాయి.
దీక్షను పట్టించుకోనట్లుగా వ్యవహరించటం వ్యూహాత్మకం అవుతుంది. కానీ.. అందుకు భిన్నంగా అవమానించేలా మాట్లాడటం.. జగన్ పై సానుభూతిని మరింత పెంచేలా చేస్తాయన్న వాదన వినిపిస్తోంది. ఏపీ మంత్రులు చేసిన ఆరోపణల్ని చూస్తే.. వారు చేసిన ఏ ఆరోపణ లాజిక్ అందని విధంగా ఉండటం గమనార్హం. వారు చేసిన ఆరోపణలు చూస్తే.. షుగర్ లెవల్స్ పెరగటం.. రెండుగంటలకోసారి బస్సులోకి వెళ్లటం లాంటి పసలేని అంశాల్ని ప్రస్తావిస్తున్నారు.
రెండు గంటలకోసారి బస్సులోకి వెళ్లి వచ్చినంత మాత్రాన ఆహారం తీసుకుంటున్నట్లా?అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఆహారం తీసుకోవాలనుకుంటే మాత్రం ప్రతి రెండు గంటలకు తింటారా? లాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు.
తమ దీక్షతో మరింత భావోద్వేగాన్ని రగల్చటానికి ప్రయత్నిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు.. ఏపీ మంత్రులు చేసిన అనవసర వ్యాఖ్యలు వారికి కొత్త ఉత్సాహాన్ని పెంచాయి. ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడటమే కాదు.. కౌంటర్ సమాధానాలు ఇస్తూ.. ప్రభుత్వానికి జవాబులు చెప్పలేని ప్రశ్నలు వేస్తున్నారు. విపక్ష నేత చేస్తున్న దీక్ష సందర్భంగా ఆయన ఆరోగ్యాన్ని చెక్ చేస్తున్న అధికారులు హెల్త్ బులిటెన్లు రిలీజ్ చేయాలని.. గత ఐదు రోజులకు సంబంధించిన వివరాలు వెల్లడించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక.. అధికారులు సైతం తమ వద్ద గత ఐదు రోజులకు సంబంధించిన రికార్డులు లేవని చెప్పటం చూసినప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది.
దీక్ష చేస్తున్న జగన్ ను హేళన చేసినట్లు మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా గురించి పోరాడుతున్న నేతపై కుట్రపూరితంగా వ్యాఖ్యలు చేయటం ఏమిటని? ఇదంతా ఏపీ అధికారపక్ష అహంకారానికి నిదర్శనమంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. రెండు గంటలకోసారి బస్సులోకి వెళ్లిన జగన్ తింటున్నారు లాంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు ఏపీ అధికారపక్షానికి కొత్త తలనొప్పులు తీసుకురావటం ఖాయమంటున్న వాదన వినిపిస్తోంది. దీక్ష చేస్తున్న వ్యక్తి కాస్త ప్రశాంతంగా ఉండటం కోసమో లేదంటే.. సేద తీరేందుకే బస్సులోకి వెళ్లి ఉండొచ్చు. అంతమాత్రానికే బస్సులోకి వెళ్లేది తినేందుకే అంటూ వ్యాఖ్యలు చేయటం బాధ్యతారాహిత్యమే అవుతుంది.