లాక్ డౌన్ ఎఫెక్ట్ : వాళ్లు తెగ సంబర పడిపోతున్నారు !

Update: 2020-04-03 02:30 GMT
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్ర‌పంచ దేశాలన్నీ  లాక్ డౌన్ అవుతున్నాయి. కరోనా కి మందు లేకపోవడం , లాక్ డౌన్ ఒక్కటే మార్గం కావడంతో ..అన్ని దేశాలు కూడా లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. ఇకపోతే  ఇప్పటికే ఈ కరోనా వైరస్ ప్రభావం భారత్ లో కూడా మొదలైంది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా ఉండేందుకు అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటోంది. క‌రోనా మ‌హమ్మారిని త‌రిమేందుకు ఇప్ప‌టికే  దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ అమ‌లవుతోంది. తాజాగా క‌రోనా విజృంభించ‌కుండా జైళ్ల శాఖ అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

జైళ్లలో కరోనా వైరస్ ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఖైదీలను పెరోల్, బెయిల్‌పై విడుదల చేస్తున్నారు. దీనితో గత కొన్నేళ్లుగా జైలు గోడల మధ్య నలిగిపోతున్న వారు కరోనా పుణ్యమా అని బయటి గాలిని పీల్చుకుంటున్నాయి. ఇకపోతే విశాఖ జిల్లాలో ఈ విధంగా కరోనా ప్రభావం కారణంగా జైళ్ళలో రద్దీని తగ్గించేందుకు సుప్రీం కోర్టు, హై కోర్టు ఆదేశాల మేరకు 74 మందిని ఒకేసారి విడుదల చేశారు. ఇందులో ఏడుగురు మహిళలు. మొత్తానికి కరోనా వైరస్ పుణ్యమాని చాలా తొందరగానే బయట ప్రపంచంలోకి అడుగు పెట్టామని ఈ ఖైదీలు సంబర పడుతున్నారు.

అయితే, లాక్ డౌన్ అమలు లో ఉండటం తో ఇప్పుడు బయట ఉన్న వారందరు కూడా    ఇళ్ళకే పరిమితం అయ్యారు. ఈ సమయంలో జైలు నుండి బయటకి వచ్చాం అన్న అనందం తప్ప ..వారికీ పెద్దగా సంతోషం ఏమి ఉండదు. ఎందుకంటే ఇంట్లో ఉన్నా కూడా జైల్లో ఖైదీల్లానే బ్రతకాలి.
Tags:    

Similar News