పోలీసులపైన ప్రైవేటు కేసులా ?

Update: 2021-05-27 15:30 GMT
పోలీసులపై ప్రైవేటు కేసులు పెట్టడానికి నేతలు, కార్యకర్తలు ఎవరు వెనకాడవద్దని చంద్రబాబునాయుడు చెప్పారు. నేతలతో జరిగిన వర్చువల్ కాన్ఫరెన్సులో చంద్రబాబు మాట్లాడుతు పోలీసులు మనపై పెడుతున్న కేసులకు భయపడవద్దని ధైర్యంచెప్పారు. కర్నూలు జిల్లా బనగానపల్లి మాజీ ఎంఎల్ఏల బీసీ జనార్ధనరెడ్డి అరెస్టు విషయమై నేతలతో చాలాసేపు మాట్లాడారు. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసు అధికారుల్లో ఎవరినీ వదిలిపెట్టేది లేదని తీవ్రంగా హెచ్చరించారు.

గడియారం ముల్లు తిరిగి వస్తుందంటు తీవ్రంగా విరుచుకుపడ్డారు. అధికారపార్టీ నేతలపై టీడీపీ చేస్తున్న ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోకపోతే ప్రైవేటు కేసులు పెట్టాలన్నారు. అక్రమ కేసులు పెడుతున్న పోలీసు అధికారులను కోర్టుకీడ్చాలని గట్టిగా చెప్పారు. ఎంపి రఘురామకృష్ణంరాజును కస్టడీలో సీఐడీ అధికారులు కొట్టిన విషయాన్ని మనమే టేకప్ చేసి లాజికల్ ఎండ్ కోసమని సుప్రింకోర్టుకు తీసుకెళ్ళామంటూ చంద్రబాబు గుర్తుచేశారు.

ఈ సమావేశంలోనే ఎంతమంది నేతలపై ప్రభుత్వం కేసులు పెట్టిందనే విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నవారిని, మన నేతలను కొడుతున్న పోలీసు అధికారుల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తున్నట్లు చంద్రబాబు హెచ్చరించారు. అందరినీ గుర్తు పెట్టుకుంటున్నామని, టీడీపీ అధికారంలోకి రాగానే ఒక్కోక్కరి కథ చెబుతామని చంద్రబాబు తీవ్రస్ధాయిలో మండిపడ్డారు.

మొత్తంమీద గురువారం నుండి ప్రారంభం కానున్న డిజిటల్ మహానాడుకు ముందురోజు పార్టీలోని సీనియర్ నేతలతో చంద్రబాబు మాట్లాడిన మాటలు, ఇచ్చిన ఆదేశాలు కాస్త ఆశ్చర్యంగానే ఉంది. టీడీపీ అధికారంలో ఉన్నపుడు తమపైన తప్పుడు కేసులు పెట్టినట్లుగా తాము తప్పుడు కేసులు పెట్టడంలేదని వైసీపీ నేతలంటున్నారు.

ఇఎస్ఐ స్కాంలో ఇరుక్కు అచ్చెన్న, హత్యకేసులో ఇరుక్కున్న కొల్లురవీంద్ర, ముఖ్యమంత్రిపై ఉద్దేశ్యపూర్వకంగానే దుష్ప్రచారం చేసిన దేవినేని, రఘురామ కృష్ణంరాజుపై ప్రభుత్వం కేసు పెట్టిన విషయాన్ని అధికారపార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. ఇప్పటివరకు ఏ ఒక్కరిపైన కూడా తమ ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టలేదన్న విషయాన్ని వైసీపీ నేతలు బల్లగుద్ది చెబుతున్నారు.
Tags:    

Similar News