కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు ఆ క్రెడిట్ ను తీసుకునేందుకు ఆ పార్టీ ఫస్ట్ ఫ్యామిలీ ఎప్పుడూ రెడీగానే ఉంటుంది. విజయం దక్కినప్పుడు సోనియాగాంధీ కానీ రాహుల్ కానీ పార్టీ నేతలను ప్రశంసించిన దాఖలాలు ఎప్పుడూ కనపడవు. అయితే వరసగా రెండో సారి దారుణమైన ఓటమి ఎదురయ్యే సరికి మాత్రం వీరు పార్టీలోని నేతల మీద విరుచుకుపడుతూ ఉన్నారు.
ఇది వరకూ ఒకసారి రాహుల్ గాంధీ తన పార్టీ నేతలను తీవ్రంగా నిందించాడట. కోర్ కమిటీ మీటింగులో కొందరు ముఖ్య నేతలపై రాహుల్ తీవ్రంగా విరుచుకుపడినట్టుగా అప్పుడు వార్తలు వచ్చాయి. పార్టీ తరఫున రాజస్తాన్ లో - మధ్య ప్రదేశ్ లో ఉన్న ముఖ్యమంత్రులను ఇతర నేతలను రాహుల్ అప్పుడు నిందించారట. పార్టీ ఓటమికి వారే కారణమంటూ విరుచుకుపడ్డారట.
మొదట ఆ వార్తలు వచ్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఆ కథనాలను ఖండించింది. అలాంటిదేమీ లేదని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ ప్రియాంక విషయంలో అలాంటి వార్తలే వస్తూ ఉన్నాయి. ఆమె కూడా పార్టీ నేతలను నిందించారట. ఓటమికి కారణం అంటూ వారిపై ప్రియాంక విరుచుకుపడినట్టుగా తెలుస్తోంది.
'అంతా మీ వల్లే' అంటూ ఆమె వారిని మొహం మీదే విమర్శించిందని వార్తలు వస్తున్నాయి. అది నిజమే కావొచ్చునేమో కానీ..ఆ నేతలను బాగా ఎంకరేజ్ చేసి వారికి అన్ని పవర్స్ ఇచ్చింది సోనియా - రాహుల్ లే అని ప్రియాంకకు తెలియదా?