మోదీ 2 కోట్ల డ్రెస్సు..రాహుల్ ఆసక్తికర కామెంట్లు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘాటు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టంపై మోదీని ఇరకాటంలో పడేస్తున్న రాహుల్ తాజాగా...మోదీ చేసిన కామెంల్ ఆధారంగా ఆయనకు కౌంటర్ ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) - జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)కి వ్యతిరేకంగా ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో చేపట్టిన ఈ దీక్షలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ - పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ - ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ - పార్టీ నేతలు పాల్గొన్నారు. రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కులను పరిరక్షించాలని దీక్షలో పాల్గొన్న నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ రూ.2 కోట్ల సూట్ దరించారని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అన్నారు.
సీఏఏకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో అమరులైన వాళ్లను స్మరించుకుంటూ రాజ్యాంగ పరిరక్షణకు తమ పార్టీ సంకల్పించిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తెలిపారు. అనంతరం రాహుల్ మాట్లాడుతూ...‘తమ గొంతుకను వినిపించడానికి ఉద్యమిస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి ఈ దీక్షను చేపట్టాం. కేంద్ర దుష్ట విధానాలతో దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. కేంద్ర విధానాలతో అవస్థలు పడుతున్న యువతకు - ముఖ్యం గా సీఏఏకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలుపుతున్నాం’ అని అన్నారు. ఆందోళనలు చేసే వారిని వారి దుస్తుల ఆధారంగా గుర్తించవచ్చని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.
`రెండు కోట్ల రూపాయల విలువైన సూట్ ధరించే మీరేంటో ప్రజలకు తెలుసు` అని ప్రధాని మోదీపై రాహుల్ మండిపడ్డారు. `మోదీ ధరించే దుస్తులను బట్టే ఆయనేంటో అర్థమవుతుంది. సామాన్యులు ధరించలేని దుస్తులు అవి` అని కామెంట్ చేశారు. సీఏఏ వ్యతిరేక నిరసనల్లో అమరులైన వాళ్లకు గుర్తుగా రాజ్యాంగ పరిరక్షణకు తమ పార్టీ సంకల్పించిందన్నారు.